సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరించిన పాక్

లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 10:02 AM IST
సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరించిన పాక్

లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.

లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో గురువారం(ఫిబ్రవరి-28,2019) సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పాక్ నిలిపివేసిన విషయం తెలిసిందే.లాహోర్ నుంచి ప్రతి సోమవారం,గురువారం ఈ రైలు బయలుదేరుతుంది.
Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

భారత్ కూడా సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు గురువారం(ఫిబ్రవరి-28,2019)  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదం కాస్త సద్దుమణగడంతో సంఝౌతా సర్వీసుని ఆపరేట్ చేయడానికి రెండు దేశాలు ఒప్పుకున్నట్లు శనివారం(మార్చి-2,2019) భారతీయ రైల్వే అధికారులు ప్రకటించారు.

 లాహోర్ రైల్వేస్టేషన్ నుంచి భారత్ కు 150మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్ ప్రెస్ బయలుదేరినట్లు సోమవారం రేడియో పాకిస్తాన్ రిపోర్ట్ చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే సంఝౌతా ఎక్స్ ప్రెస్ లాహోర్ నుంచి వాఘా వరకు వస్తుంది. ప్రతి బుధవారం,ఆదివారం ఢిల్లీ నుంచి బయల్దేరే సంఝౌతా ఎక్స్ ప్రెస్ అట్టారి వరకు వెళ్తుంది. 
Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు