పంట వ్యర్థాల కాలుష్య సమస్యకు మహిళా రైతు పరిష్కారం..అదనపు ఆదాయం కూడా పొందుతున్న ఆదర్శ వనిత

పంట వ్యర్థాల కాలుష్య సమస్యకు మహిళా రైతు పరిష్కారం..అదనపు ఆదాయం కూడా పొందుతున్న ఆదర్శ వనిత

Pakistan Women farmer crop waste pollution problem : దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టటం వల్ల జరిగే కాలుష్యం అంతా ఇంతా కాదు. కాలుష్య కోరలకు ప్రజలు పలు రోగాలకు గురవుతున్నారు. మరోపక్క పర్యావరణానికి విపరీతమైన ప్రమాదం జరుగుతోంది.

 

భారత్‌లోని ఢిల్లీ వంటి నగరాల్లో వాయుకాలుష్యానికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడమే కారణమనే విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా…అందుకు కారణమౌతున్న పంట వ్యర్థాల దగ్ధం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం హెచ్చరించినా పంజాబ్ లోని గ్రామాలలో రైతులు తమ పంట వ్యర్థాలను దగ్ధం చేయడం ఆపటంలేదు. గత్యంతరం లేక రైతులు పంటల వ్యర్థాలను దగ్ధం చేస్తున్నారు. దీని వల్ల వచ్చే పొగ కాలుష్యంగా మారుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో శీతాకాలంలో ఈ కాలుష్య సమస్య మరింతగా పెరుగుతోంది. ఈ కాలుష్యం ప్రజల ప్రాణాల్ని హరించేస్తోంది. చిన్నారులు జబ్బులబారిన పడేలా చేస్తోంది.మరోపక్క పర్యావరణానికి తీరని నష్టం చేస్తోంది.

ఇటువంటి సమస్య పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్యే ఉంది. అయితే, పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళా రైతు మాత్రం పంట వ్యర్థాలు తగలబెట్టకుండా మిగతా రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. వ్యర్థాలను తగలబెట్టకుండా ఇతర పద్ధతుల్లో పంట కోత పద్ధతుల్ని వినియోగిస్తున్నారు.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోరి గుజరన్ వాలా జిల్లాలోని మహిళా రైతు సమీనా బిన్యామిన్ పంట వ్యర్ధాలను తగులబెట్టకుండా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. బీఏ బీఈడీ చదివిని సమీనా బిన్యామిన్ పంట వ్యర్ధాలను తగులబెట్టటం వల్ల వచ్చే నష్టాన్ని గురించి పూర్తి అవగాహన పొందారు. ఇది తగులబెట్టినవారే కాకుండా ప్రజలందరికీ తీవ్ర నష్టంకలిగిస్తోందన్నారు.

పర్యావరణం పాడైపోతోంది. దీంతో సకాలంలో వర్షాలు కురవటంలేదు. చిన్నారులు దగ్గు జర్వాల బారిన పడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారన్నారు. దీనికి పరిష్కారం కోసం నేను ఒక ప్రత్యేక వరికోత యంత్రాన్ని వాడుతున్నారు. ఈ యంత్రంతో వరి పంట కోస్తే గడ్డి వృధా కాదని..పైగా పశువులకు కూడా చక్కటి గడ్డి మిగులుతుందని తెలిపారు.

ఈ యంత్రంతో వరి పంట కోత యంత్రం వరిని కుదుళ్లదాకా కోస్తుంది. మిగిలిన కొద్దిపాటి వ్యర్థాలను ఎండిపోయాక పొలంలో దున్నేస్తాం. అది పొలానికి ఎరువులాగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో పంట వ్యర్థాలను తగులబెట్టాలని అవసరమే ఉండదని సమీనా తెలిపారు.

అంతేకాదు ఈ ప్రత్యేకమైన యంత్రంతో పంట కోస్తే వడ్లు పగిలిపోవనీ..వడ్లు చక్కటి క్వాలిటీతో ఉండటంతో మార్కెట్ లో చక్కటి ధర కూడా లభిస్తుందని తెలిపారు. అంతేకాదు ఈ వరికోత యంత్రం వల్ల నాణ్యమైన పశుగ్రాసం కూడా లభిస్తుంది. ఆ పశుగ్రాసాన్ని అమ్మితే అదనపు ఆదాయాన్ని పొందుతున్నాను. ఈ యంత్రం కోత అద్దెకంటే పశుగ్రాసం అమ్మితే వచ్చే డబ్బులే ఎక్కువగా ఉంటాయికాబట్టి ఆ డబ్బులు కూడా మిగులుతున్నాయి.

అదే కూలీలను పెట్టుకుంటే కూడా యంత్రానికి అయ్యేంత ఖర్చుకంటే ఎక్కువ అవుతుంది. పైగా కూలీలకు అదనంగా తిండి ఖర్చు కూడా భరించాల్సి వస్తుంది. పైగా వరిగడ్డిని తగులబెట్టాల్సి వస్తుంది. రైతుల్లో చాలామంది గోధుమ పంట కోతకు ఉపయోగించే యంత్రాలనే వాడుతున్నారు.దీంతో పంట వ్యర్ధాలు కూడా మిగిలిపోవటంతో వాటిని తగులబెట్టాల్సి వస్తోంది. దీంతో పెద్దల నుంచి చిన్నారుల వరకూ జబ్బులు వస్తున్నాయి. దీంతో హాస్పిటల్ ఖర్చులు మరింత అదనంగా ఉంటున్నాయి.

కాబట్టి పంట కోతలకు ఇటువంటి ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తూ అదనపు ఆదాయం పొందవచ్చు. పైగా కాలుష్యకారకాలను తగ్గించవచ్చు..ఆరోగ్యాన్ని పొందవచ్చంటున్నారు. మహిళా సమీనా బెన్యామిన్. సమీనాను చూసిన ఇంకా కొంతమంది రైతులు ఆమె బాటలోనే నడుస్తున్నారు. కానీ ఇంకా చాలామందిలో మార్పు రావాల్సి ఉందని సమీనా అంటున్నారు. ఈ ప్రత్యేక యంత్రం ద్వారా వరిని కోస్తే గడ్డి వృథాను తగ్గించడంతో పాటు, పర్యావరణానికి కూడా మేలు చేయొచ్చని సమీనా బెన్యామిన్ అంటున్నారు.