సో క్యూట్ : ‘టమోటా’ జ్యువెలరీతో పెళ్లి కూతురు

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 10:40 AM IST
సో క్యూట్ : ‘టమోటా’ జ్యువెలరీతో పెళ్లి కూతురు

పెళ్లి కూతురంటే మెడలో బంగారు నగలతో మెరిసిపోతుంటుంది. బాగా ధనవంతులైతే..వజ్రాల నగలతో పెళ్లికూతుర్ని మెరిపించేస్తారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం ‘టమోటా’ నగలతో భలే భలే క్యూట్ గా మెరిసిపోతోంది. టమోటా నగలు పెట్టుకోవాలని ఈ పెళ్లి కూతురు ముచ్చట చూస్తుంటే వాహ్..ఖర్చు లేదు..అందానికి ఏమాత్రం తక్కువా లేదు అనిపిస్తోంది. 
ముచ్చటైన ముద్దు గుమ్మకు ఏం పెట్టినా అందమే అన్నట్లుగా ఉంది. మెడలో హారంలా టమోటల దండ వేసుకుంది. చేతులకు కూడా టమోటా గాజుల్ని వేసుకుంది. చెవులకు జుంకాలుగా..నుదుటిన కూడా టమోటాతో చక్కగా అలంకరించుకుందీ..ఈ టమోటా నగల పెళ్లి కూతురు. 

ఈ పాకిస్థాన్ పెళ్లి కూతురు టమోటా నగల గురించి తెలుసుకున్న ఓ రిపోర్టర్ నైలా ఇనాయత్ హాయ్ అంటూ వాలిపోయాడు. ఏంటీ ఈ టమోటా నగల ఐడియా అంటూ ప్రశ్నించాడు. దాని ఆ పెళ్లికూతురు మాట్లాడుతూ.. బంగారం ధరలు పెరిగాయి. దీంతోపాటు టమోటా ధరలు కూడా పెరిగాయి. అందుకే నా పెళ్లిలో బంగారానికి బదులుగా టమోటాల నెక్లెస్‌ను ధరించానని చెప్పింది. పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో టమోటా ధరలు కిలో రూ.300-400 వరకు పలుకుతోందట.

ఈ క్రమంలో ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఉంటుందీ..అందరినీ ఆలోచింపజేసేలా ఈ  నవ వధువు క్రియేటివ్ గా ఆలోచించింది. ఈ వీడియోను మంగళవారం (నవంబర్ 19)న రిపోర్టర్ నైలా ఇనాయత్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా 32వేలు వ్యూస్.. ఫేస్‌బుక్‌లో 1.3 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. పెళ్లికూతురు ట్రెండ్లీ థింకింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Tomato jewellery. In case you thought you’ve seen everything in life.. pic.twitter.com/O9t6dds8ZO

— Naila Inayat नायला इनायत (@nailainayat) November 18, 2019