Pakistani Fisherman : మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన చేప.. ఖరీదు రూ.72లక్షలు

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింది. ఓ చేప అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఏకంగా లక్షాధికారిని చేసింది.

Pakistani Fisherman : మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన చేప.. ఖరీదు రూ.72లక్షలు

Pakistani Fisherman

Pakistani Fisherman : అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడి విషయంలో ఇదే జరిగింది. ఓ చేప అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఏకంగా లక్షాధికారిని చేసింది.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరానికి చెందిన సాజిద్‌ హాజీ అబాబాకర్‌ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. మరి.. అబాబాకర్‌ పట్టింది మామూలు చేప కాదు. అదో అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందినది. అందుకే 48 కేజీల బరువైన ఈ చేప వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది.

యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతి చేపలకు ఫుల్ డిమాండ్‌ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. క్రోకర్‌ జాతి చేప విషయం వేరు. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర.

నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్‌ తీరంలోనే ఒక మత్స్యకారుడు ఈ క్రోకర్‌ జాతి చేపను పట్టాడు. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది.