ఇండియా అంతర్గత గొడవలు తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందంటోన్న పాక్

ఇండియా అంతర్గత గొడవలు తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందంటోన్న పాక్

Pakistan: ఇండియాలో జరుగుతున్న అంతర్గత వివాదాలను తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందని Pakistan విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అంటున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నల్ గా జరుగుతున్న బేధాబిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేస్తుందని ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి చెప్పుకొచ్చాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న ఆయన అబుదాబి వేదికగా మీడియాతో మాట్లాడారు.

యూఏఈ లీడర్ షిప్ గురించి మాట్లాడిన Pakistan మంత్రి ఈ విధంగా చెప్పారు. తమకు అందిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఇది ముఖ్యమైన విషయం. దీనికి ట్యాక్టిక్ గా అప్రూవల్ కూడా పొందేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

ఈ మేరకు ఆల్రెడీ Pakistan ఆర్మీకి హై అలర్ట్ ప్రకటించాం. ఏ క్షణంలోనైనా ఇండియా నుంచి సర్జికల్ స్ట్రైక్ జరగొచ్చని చెప్పాం. Pakistan క్యాంపులపై రెండోసారి కాల్పులు జరిపి సర్జికల్ స్ట్రైక్స్ కు పాల్పడే అవకాశం ఉందని.. ప్రధాని మోడీ గతంలో ఆదేశాలిచ్చిన ఘటనను గుర్తు చేసుకున్నారు.

2016 సెప్టెంబర్ 29న తొలిసారి యూఆర్ఐ టెర్రర్ అటాక్ తో సర్జికల్ స్ట్రైక్ జరగ్గా, రెండో సారి 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాలాకోట్ వేదికగా కాల్పులు జరిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 26న ఈ దాడి చేసింది. ఈ రెండు చర్యలను ప్రస్తావించిన Pakistan.. తమ లీడర్ షిప్ కాపాడుకునేందుకు ఇండియా మరోసారి దాడి చేయబోతుందంటూ పాక్ చెప్తుంది.