Pakistan Hindu Council : భారత్‌లో దేవాలయాలను సందర్శించనున్న పాకిస్థాన్ హిందువుల బృందం..

భారత్‌లో దేవాలయాలను సందర్శించనున్న పాకిస్థాన్ హిందువుల బృందం రానుంది.

Pakistan Hindu Council : భారత్‌లో దేవాలయాలను సందర్శించనున్న పాకిస్థాన్ హిందువుల బృందం..

Pakistan Hindu Coucil Visit India Temples

Pakistan Hindu Council visit india temples: పాకిస్తాన్ లోని హిందువుల బృందం భారతదేశంరానుంది. భారత్ లోని పలు దేశాలను సందర్శించనుంది. దీని కోసం పాకిస్థాన్ అధికారులు ఆదివారం (డిసెంబర్,2,2022) భారత దేశ అధికారులకు సమాచారం అందించారు. మా దేశంలోని మైనార్టీల కోసం ప్రభుత్వం మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని..పాకిస్తాన్ హిందూ పరిషత్ చీఫ్ రమేష్ కుమార్ వెల్లడించారు. తమ దేశపు హిందువుల బృందం భారత్ పర్యటనతో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏర్పడతాయని తాము నమ్ముతున్నామని దానికి ఇది ఒక అడుగు అని తాము భావిస్తున్నామన్నారు. కొత్త సంవత్సరంలో ఈ పర్యటన ఒక శుభారంభాన్ని కలిగిస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

Read more : Omicron In Delhi : ఢిల్లీలో ఆ 2 రోజులు..84శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్

పాకిస్థాన్ హిందుల బృందం జనవరి 20న భారత్‌కు చేరుకుని భారత్ లోని పలు దేవాలయాలను సందర్శించనుంది. కాగా..ఈ బృందం భారత్ లో ఏయే ఆలయాలను సందర్శిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. వాయువ్య పాకిస్థాన్‌లోని 100 ఏళ్ల పురాతన మహారాజా పరమహంస జీ ఆలయాన్ని ఆదివారం భారతదేశం, అమెరికా, గల్ఫ్ ప్రాంతానికి చెందిన 200 మందికి పైగా హిందూ భక్తులు సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల భద్రత కోసం 600 మంది సిబ్బందిని నియమించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ జిల్లా తేరి గ్రామంలోని పరమహంస జీ ఆలయం, ‘సమాధి’ గత సంవత్సరం పునరుద్ధరించబడింది.

Read more : Chandrababu: గుంటూరు దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆలయాన్ని సందర్శించిన హిందువుల బృందంలో భారతదేశం నుండి దాదాపు 200 మంది యాత్రికులు, 15మంది దుబాయ్ నుండి, మిగిలినవారు US , ఇతర గల్ఫ్ దేశాలవారు ఉన్నారు. 2020 సంవత్సరంలో.. పర్యాటనకు వెళ్లిన ప్రయాణీకులపై ఒక గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలు అన్ని దేశాళు ఖండించారు. ఈ క్రమంలో అటువంటి ఘటన మరోసారి జరగకూడదని ఈ సంత్సరం పాకిస్థాన్ ప్రభుత్వం భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది.