టమాటాలు ఇవ్వకపోతే ఆటం బాంబులు వేస్తాం: పాక్ రిపోర్టర్ పిచ్చి వాగుడు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 07:43 AM IST
టమాటాలు ఇవ్వకపోతే ఆటం బాంబులు వేస్తాం: పాక్ రిపోర్టర్ పిచ్చి వాగుడు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు  తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు చేసింది. పాక్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 200శాతం సుంకం విధించింది. నదీజలాలు కూడా నిలిపివేసింది. టీ  ఉత్పత్తులతో పాటు రీసెంట్‌గా పాక్‌కు టమాటాల ఎగుమతులను కూడా బంద్ చేసింది.

టమాటాల సప్లయ్ బంద్ చేయడంపై పాక్ మీడియా ఛానల్ ఒకటి ఓవరాక్షన్ చేసింది. ఆ ఛానల్ రిపోర్టర్ పిచ్చి వాగుడు వాగాడు. తోబా తోబా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ‘భారత్ మనకు  టమాటాలు ఆపేస్తే మనం 20 రోజులు బ్రతికేస్తాం. వచ్చే ఏడాది మనమే భారత్‌కు టమాటాలు పంపిస్తాం. భారత ప్రభుత్వం, మీడియా, ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే.. పాక్ నుండి ఆటం  బాంబులు వేస్తాం’ అని ఆ రిపోర్టర్ వార్నింగ్ ఇచ్చాడు. ”వక్త్ ఆ గయా.. టమాటర్ కా జవాబ్.. ఆటం బాంబ్ సే దియా జాయేగే” అంటూ ఆ రిపోర్టర్ బెదిరించాడు. పాకిస్తాన్‌తో పెట్టుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టమాటాలు ఇవ్వకపోతే ఆటం బాంబులు వేస్తారా.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నువ్వు నీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయని తెగ నవ్వుకుంటున్నారు. నీకు పిచ్చి ముదిరింది వెంటనే పిచ్చి ఆస్పుత్రిలో జాయిన్ అవ్వు అని సలహా ఇస్తున్నారు.