Pak Minister Ahsan Iqbal : ‘టీ తాగడం తగ్గించండి..దేశ ఆర్థికవ్యవస్థను కాపాడండి’ అంటూ దేశప్రజలకు మంత్రిగారి విన్నపం

 పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థకు..ప్రజలు తాగే ‘టీ’కి సంబంధం ఉందా? పాక్ ప్రజలు ‘టీ’తాగటం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిందా? అంటే అదే నిజమంటున్నారు పాకిస్థాన్ మంత్రివర్యులు. ‘దేశ ప్రజలారా టీ తాగటం తగ్గించండీ..దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండీ’ అంటూ వేడుకుంటున్నారు మంత్రి.

Pak Minister Ahsan Iqbal : ‘టీ తాగడం తగ్గించండి..దేశ ఆర్థికవ్యవస్థను కాపాడండి’ అంటూ దేశప్రజలకు మంత్రిగారి విన్నపం

Pak Minister Asks People To Reduce Tea Consumption

Pak Minister asks people to reduce tea consumption : పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థకు..ప్రజలు తాగే ‘టీ’కి సంబంధం ఉందా? పాక్ ప్రజలు ‘టీ’తాగటం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిందా? అంటే అదే నిజమంటున్నారు పాకిస్థాన్ మంత్రివర్యులు. ‘దేశ ప్రజలారా టీ తాగటం తగ్గించండీ..దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండీ’ అంటూ వేడుకుంటున్నారు. అదేంటీ ప్రజలు టీ తాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టమేంటీ? ఆ వింత కష్టమేంటీ సాక్షాత్తు మంత్రిగానే ప్రజలను టీ తాగవద్దు అని కోరటం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే..

సాధారణంగా చాలామంది కాస్త ఎక్కువగా చెప్పాలంటే అందరు ఉదయం లేవగానే కప్పు టీ గొంతులో పడకుండా ఒక్కపని కూడా చేయరు. అదే కప్పు టీ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటూ నమ్మశక్యం కావటంలేదు. కానీ ఇది నిజమంటున్నారు పాకిస్థాన్ మంత్రి. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కుప్పకూలకుండా ఉండటానికి తాగే టీలు తగ్గించాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రజలు ప్రతీరోజుజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే.. పాకిస్తాన్ భారీ దిగుమతుల ఖర్చులు తగ్గుతాయని చెప్పుకొస్తున్నారు పాకిస్థాన్ మంత్రి అహసాన్ ఇక్బాల్.

Also read : Food Crises in Pakistan: ‘ప్రజలు ఒక్కపూటే తినండీ తక్కువ తినండీ’ : పాక్ మంత్రిగారి వ్యాఖ్యలు

పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రెండు నెలలదిగుమతులకు చెల్లించగల నిల్వలే ఉన్నాయి. దీంతో దేశానికి నిధులు అత్యవసరమయ్యాయి. ప్రపంచంలో తేయాకును మరే దేశంకన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్. గత ఏడాది 60 కోట్ల డాలర్ల అంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది.

ఈక్రమంలో దేశ ప్రజలంతా రోజుకు ఒకటి, రెండు కప్పులు టీ తాగటం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను…దయచేసి టీ తాగటం తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండీ అని కోరుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు మంత్రి అహసాన్. దానికి మంత్రి వివరణ ఇస్తూ.. ‘‘ఎందుకంటే మనం తెచ్చుకున్న అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్నాం” అని మంత్రి ఇక్బాల్ దేశ ప్రజలను కోరారని పాకిస్తాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.

మంత్రిగారి విజ్ఞప్తులపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత చర్యల వల్లే దేశంలో ధరలు పెరిగాయని, పెరిగిన ధరలను తగ్గించకుండా టీ తాగడం తగ్గించాలని కోరటం ఏంటీ కనీసం టీ కూడా ప్రజల్ని తాగనివ్వరా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రజలు టీ తాగటం తగ్గించాలంటూ ప్రభుత్వం కోరటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనం టీ తాగటం తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు పరిష్కారమవుతాయా? అని చాలా మంది సెటైర్లు వేస్తున్నారు.

అంతేకాదు అధికారులు విద్యుత్‌ను ఆదా చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.దీంట్లో భాగంగా..విద్యుత్ ఆదా చేయటానికి మార్కెట్‌లలో వ్యాపారాలు, దుకాణాలు, స్టాల్స్‌ను రాత్రి 8:30 గంటల కల్లా కట్టివేయాలని అధికారులు వ్యాపారులకు సూచిస్తున్నారు. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు ఫిబ్రవరిలో 1,600 కోట్ల డాలర్లుగా ఉంటే.. జూన్ మొదటి వారానికి 1,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం.. పాక్ దిగుమతులు చేసుకునే రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతుంది. ఈ నిధులను పొదుపుగా వినియోగించే ప్రయత్నంలో భాగంగా మే నెలలో.. నిత్యావసరం కాని లగ్జరీ వస్తువుల దిగుమతిని ప్రభుత్వం నిలిపివేసింది.

Also read :  Pakistan: ట్యాక్స్ కట్టకపోతే ఓటు హక్కు ఉండదు..దుమారం రేపుతున్న పాక్ ఆర్థిక సలహాదారు హెచ్చరిక

పాకిస్తాన్‌లో ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం విషమ పరీక్షగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. దీంతో ప్రజలపై ఆంక్షలు పెడుతోంది.

అలాగే గత ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం విమర్శలు సంధిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని..దానిని గాడిలో పెట్టటం పెద్ద సవాలుగా మారిందని దానికి ప్రజలు సహకరించాలని షాబాజ్ చెప్పుకొస్తున్నారు.

పాక్ ఆర్థిక వ్యవస్థ ఏళ్ల తరబడి ఎదుగుదల లేకుండా స్తబ్దంగా ఉండిపోవటంతో పాటు విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత వల్ల కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి గట్టెక్కటానికి పాక్ 2019లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకోవటానికి ఒప్పందం చేసుకుంది. కానీ.. పాక్ ఆర్థిక వనరుల పరిస్థితుల గురించి ఐఎంఎఫ్ ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఐఎంఎఫ్ సహాయ ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోయింది. దీనిని తిరిగిప్రారంభించేలా ఐఎంఎఫ్‌ను ఒప్పించటం లక్ష్యంగా షాబాజ్ మంత్రివర్గం గత వారంలో 4,700 కోట్ల డాలర్ల వ్యయ ప్రణాళికతో కొత్త బడ్జెట్‌ను ప్రకటించింది.