ఈ జన్మకు ఇదే హైలెట్ : పాక్ రిపోర్టర్ పీకల్లోతు రిపోర్టింగ్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 01:45 PM IST
ఈ జన్మకు ఇదే హైలెట్ : పాక్ రిపోర్టర్ పీకల్లోతు రిపోర్టింగ్

పాకిస్తాన్ రిపోర్టర్ల పిచ్చి పరాకాష్టకు చేరింది. వైవిధ్యం పేరుతో వారు చేస్తున్న పనులకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. గాడిదల సంతతి పెరుగుతోందని చెప్పేందుకు ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్ ఒకతను ఏకంగా గాడిద మీద ఎక్కి రిపోర్టింగ్ చేశాడు. ఆ క్రమంలో అతడు పడిన కష్టాలు, అతడిని గాడిద కిందపడేసిన వైనం జనాలకు పిచ్చ నవ్వు తెప్పించింది. తాజాగా మరో రిపోర్టర్ రెచ్చిపోయాడు. అతడి నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి అతడు రిపోర్టింగ్ చేశాడు. వరద ప్రవాహంలో, పీకల్లోతు నీళ్లు పారుతున్న నదిలో దిగి పీ టూ సీ ఇచ్చాడు. ఆ రిపోర్టింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

పాక్‌లో వర్షాలు కురుస్తున్నాయి, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద తీవ్రత గురించి స్థానికి మీడియా కథనాలు ఇచ్చింది. ఓ రిపోర్టర్ మాత్రం అందరికి భిన్నంగా ఏకంగా నదీ ప్రవాహంలోకి దిగాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో నిలబడి రిపోర్టింగ్‌ చేశాడు. అతడి పీకల వరకు నీరు వచ్చింది. అయినా అతడు వెనక్కితగ్గలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.

కొందరు అభినందిస్తే, మరికొందరు తిడుతున్నారు. జాగ్రత్త బాబూ.. వరదలో కొట్టుకుపోతావ్ అంటూ కొందరు సెటైర్లు వేశారు. ఇది మరీ టూ మచ్ అంటున్నారు. రేటింగ్స్ కోసం, పబ్లిసిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఏ మాత్రం తేడా వచ్చినా భూమ్మీద నూకలు చెల్లిపోయి ఉండేవని, అతడి ఫొటోకి దండేసి దండం పెట్టాల్సి వచ్చేదని మండిపడుతున్నారు. కొందరేమో రిపోర్టర్ ప్రయత్నాన్ని అభినందించారు. అతడి క్రియేటివ్ ఐడియాకు హ్యాట్సాప్ చెప్పారు.

Also Read : మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్