భారత సరిహద్దులో ఫొటోలు తీస్తున్న పాక్ spy డ్రోన్.. కూల్చేసిన BSF

  • Published By: nagamani ,Published On : June 20, 2020 / 04:42 AM IST
భారత సరిహద్దులో ఫొటోలు తీస్తున్న పాక్ spy డ్రోన్.. కూల్చేసిన BSF

భారత సరిహద్దులో పాకిస్థాన్ తన కుక్కబుద్ధిని చూపించుకుంటూనేఉంది. భారత్ ఎన్ని చావుదెబ్బలు కొట్టినా ఏమాత్రం సంస్కారం లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ సీక్రెట్ డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చిపడేశాయి. 

జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ సెక్టార్, రథువా వద్ద శనివారం (జూన్ 20,2020) తెల్లవారుజామున 5:10 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ఎగురుతూ ,కనిపించింది. రహస్యంగా అది ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేశారు. 

సరిహద్దులో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ డ్రోన్ నుంచి చిన్న చిన్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామనీ..  దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read: ఇండియా-చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం..భారత వాయుసేన గర్జనలతో దద్దరిల్లుతున్న గాల్వాన్ లోయ