Pakistan: పాకిస్తాన్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం.. హాస్పిటళ్లలో మందులూ దొరకని స్థితి.. రోగుల అవస్థలు

ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.

Pakistan: పాకిస్తాన్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం.. హాస్పిటళ్లలో మందులూ దొరకని స్థితి.. రోగుల అవస్థలు

Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆహారం, చమురు ధరలు విపరీతంగా పెరిగి ఇబ్బంది పడుతున్న పాక్ ప్రజల్ని ఇప్పుడు మరో పెద్ద సమస్య వేధిస్తోంది. రోగులు చికిత్స తీసుకోవడానికి ఔషధాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు. దీంతో రోగులు తమ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులు కూడా రోగులకు చికిత్స చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శస్త్రచికిత్సలకు అవసరమయ్యే అనస్థీషియా కూడా దొరకడం లేదు.

Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి

ప్రస్తుతం పాకిస్తాన్‌లో రెండు వారాలకు సరిపడా మాత్రమే అనస్థీషియా నిల్వలు ఉన్నాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య సేవలు నిలిచిపోతుండటంతో ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితిపై ఔషధ తయారీ సంస్థలు స్పందించాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చమురు ధరలు, రవాణా చార్జీలు పెరగడం వల్ల ఔషధాల తయారీ పరిశ్రమలపై అధిక భారం పడుతోంది.

అలాగే ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ముడి సరుకు వచ్చే అవకాశం లేదు. దీంతో ఔషధాలు తయారు చేయలేని పరిస్థితి నెలకొంది. కరాచీ పోర్టులో ఔషధాలు, ముడి పదార్థాలు నిలిచిపోయి ఉన్నాయి. డాలర్లలో చెల్లింపులు జరిపితేనే, అవి దేశంలోకి వస్తాయి.