Pakistan’s Petrol Price: పాక్ లో పెట్రోల్‌ ధర లీటరు రూ. 249.80కు పెరిగిన వైనం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో శ్రీ‌లంక త‌ర‌హా ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఇంధన ధరలు స‌హా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. వ‌రుస‌గా డాలరుతో పోల్చితే పాక్ రూపాయి మార‌కం విలువ ప‌డిపోతుండ‌డంతో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది.

Pakistan’s Petrol Price: పాక్ లో పెట్రోల్‌ ధర లీటరు రూ. 249.80కు పెరిగిన వైనం

Pakistan’s Petrol Price: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో శ్రీ‌లంక త‌ర‌హా ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఇంధన ధరలు స‌హా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. వ‌రుస‌గా డాలరుతో పోల్చితే పాక్ రూపాయి మార‌కం విలువ ప‌డిపోతుండ‌డంతో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది.

పాక్ లో లీట‌రు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను రూ.35(పాకిస్థానీ రూపాయి) చొప్పున పెంచుతున్న‌ట్లు ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 249.80కు పెరిగింది. అలాగే, డీజిల్ ధర లీట‌రుకు రూ. 262.80కు చేరింది. అంతేకాదు, లైట్‌ డీజిల్ ధరలు, కిరోసిన్ ధ‌ర‌ లీటరుకు 18 రూపాయ‌ల‌ చొప్పున పెంచుతున్నట్లు పాక్ ప్ర‌భుత్వం నిన్న ప్ర‌క‌టించింది.

దీంతో కిరోసిన్ ధర లీట‌రు రూ.189.83గా, లైట్‌ డీజిల్ లీట‌రు రూ.187కు పెరిగింది. నిన్న‌టి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. పాక్ లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో ర‌వాణాతో ముడిప‌డి ఉన్న అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

ఇప్ప‌టికే అధిక ధ‌ర‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్ర‌జ‌ల తిప్ప‌లు ఇప్పుడు మ‌రింత పెరిగాయి. మ‌రోవైపు, ఆహార సంక్షోభం కూడా పాక్ ను వెంటాడుతోంది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ కూడా నిధులు ఇవ్వ‌డంలో ఆల‌స్యం చేస్తుండ‌డంతో పాక్ త్వ‌ర‌లోనే దివాలా తీసే ముప్పు ఉంది.

Kangana Ranaut : పఠాన్ విజయానికి ఇండియా సెక్యులర్ కంట్రీ అంటూ ట్వీట్ చేసిన నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్..