సరదా తీరిపోయింది : అటువంటి మాస్కు పెట్టుకున్నాడని అరెస్ట్

సరదా తీరిపోయింది : అటువంటి మాస్కు పెట్టుకున్నాడని అరెస్ట్

Pak man atrrested for Wolf Mask : ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు పాతకరోనా..కొత్త కరోనా కోరల మధ్యనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వాలు పలు నిబంధనలు విధించాయి. కానీ జనాలు పాటిస్తున్నారా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్నే. ఈక్రమంలో పాకిస్థాన్ లో ఓ వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలకు సరదాగా ఓ వెరైటీ మాస్కు వేసుకుని వచ్చాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్థాన్​లోని పెషావర్​లో నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు ఓ వ్యక్తి కరోనా బారిన పడకుండా జాగ్రత్త కోసం కాకుండా నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నవారిని సరదాగా భయపెట్టాలని అనుకున్నాడు. 2020లో చివరి రోజు ప్రజలపై ప్రాంక్ చేయాలనుకున్నాడు.

దాని కోసం ఓ ప్లాన్ వేశాడు. తోడేలులా ఉండే ఓ మాస్కును ముఖానికి వేసుకొని వీధుల్లోకి వచ్చాడు. ఆ మాస్కు పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తిని చూసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని ఒమర్ ఖురేషీ అనే పాకిస్థాన్ జర్నలిస్టు ట్విట్టర్​లో ఫొటోతో సహా ట్వీట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. తోడేలు మాస్కు ధరించిన వ్యక్తితో పాటు పోలీసులు కూడా ఆ ఫొటోలు ఉన్నారు.

అయితే సరదాగా మాస్కు వేసుకున్న అతడిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు మాస్కు పెట్టుకోకుండా రాకపోతే అరెస్ట్ చేయాలి కానీ ఏదో సరదాకోసం చేస్తే ఇలా అరెస్ట్ చేయటమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.