గుండెల్నిపిండే ఫోటో..కరోనా సోకిన తల్లిని చూడటానికి ఆస్పత్రి కిటికీపైకెక్కి చూసుకుంటున్న కొడుకు

  • Published By: nagamani ,Published On : July 21, 2020 / 10:26 AM IST
గుండెల్నిపిండే ఫోటో..కరోనా సోకిన తల్లిని చూడటానికి ఆస్పత్రి కిటికీపైకెక్కి చూసుకుంటున్న కొడుకు

పిల్లలకు చిన్న నలత చేసిన తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ ఓ కొడుకు మాత్రం కరోనా మహమ్మారి బారిన పడి హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్న తల్లిని చూడాలని తపించిపోయాడు. కానీ తల్లి దగ్గరకువెళ్లి చూడటానికి వీల్లేదు. కానీ అమ్మను చూడకుండా ఆ 30ఏళ్ల కొడుకు జిహాద్ అల్-సువైటి ఉండలేకపోయాడు. తాను దగ్గరుండి తల్లిని చూసుకోలేకపోతున్నాననే బాధ..ఆవేదన అతన్ని వేధించింది.

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అమ్మను చూడకుండా ఉండలేకపోయాడు. దానికో ఉపాయం ఆలోచించాడు. ఓ కొడుకు అనుభవించిన చిత్రవధ నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది. తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోకి వెళ్లి ఆమెను చూసే వీలులేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని అతడు చిన్న ఉపాయం ఆలోచించాడు.
పాలస్తీలనాలోని వెస్ట్ బ్యాంక్‌లోని బీట్ ఆవా పట్టణంలో తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి గది కిటికీ ఎక్కి కూర్చుని రాత్రీపగలు తల్లిని చూసుకుంటూ ఉండిపోయేవాడు. తల్లి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోటి దేవుళ్లకు మొక్కుకున్నాడు. 73ఏళ్ల తల్లి రస్మి సువైట్ కి ఏమీ కాకూడదని భగవంతుడా..నా అమ్మను నానుంచి దూరం చేయవద్దని ప్రార్థించేవాడు. కానీ..కానీ అతని ఆశలు..ఫలించలేదు.చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అది తెలిసి ఆ కొడుకు గుండె బ్రద్దలైపోయింది. కంటికి కడివెడు కన్నీరుగా ఏడ్చాడు. గుండెలవిసేలా రోదించాడు.ఇలా ఎంతోమంది బంధాలను కర్కశంగా కాలరాసేస్తోంది కరోనా మహమ్మారి.

పాలస్తీనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చూసిన వారి హృదయాలను పిండేస్తోంది. మనస్సుని ద్రవించిపోయే ఈ ఫోటోను చూసినవారంతా ఈ కరోనా రాకాసి ఎంతకఠినమైంది. ఇంకెంతకాలం..ఇంకెన్ని జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుందోకదా..ని ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి తల్లిని చూసుకున్న ఆ కొడుకు ఫోటోను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.