పెళ్లైన 12 రోజులకే విడాకులకు పమీలా అండర్సన్ రెడీ

  • Published By: sreehari ,Published On : February 3, 2020 / 10:18 AM IST
పెళ్లైన 12 రోజులకే విడాకులకు పమీలా అండర్సన్ రెడీ

ఆమెకు పెళ్లి కొత్త కాదు.. సీక్రెట్‌గా ఓ ప్రొడ్యుసర్‌ను పెళ్లాడింది. పెళ్లి విషయం అందరికి తెలిసే లోపే పెటాకులై పోయింది. 12 రోజులకే విడాకులకు రెడీ అయింది. రెండు వారాల కంటే తక్కువ సమయంలోనే విడిపోతున్నామంటూ అభిమానులకు షాకిచ్చింది. ఆమె ఎవరో కాదు.. హాలీవుడ్ నటి 52ఏళ్ల పమేలా అండర్సన్.

తన విడాకుల వ్యవహారంతో మళ్లీ అండర్సన్ వార్తల్లో నిలిచింది. పెళ్లి చేసుకుందనే షాక్ నుంచి ఇంకా అభిమానులు తెరుకోకముందే విడాకులకు కూడా రెడీ కావడంతో తెలిసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. విడాకులు తీసుకుందామంటే ఆమె కొత్త మాజీ భర్త జాన్ పీటర్స్ (74) కూడా సై అన్నాడట.

ఈ ఏడాదిలో జనవరి 20న మాలిబులో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇంకా దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఇంతలోనే విడాకులు తీసుకోవాలంటూ రెడీ అయిపోయింది ఈ జంట.

androson

‘ నేను జాన్ తో కలిసి నా ప్రయాణం కొనసాగించాను. జీవితమనేది ఒక ప్రయాణంలా కొనసాగుతూనే ఉంటుంది. మేమిద్దరూ కలిసి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా మ్యారేజ్ సర్టిఫికేట్‌ను లాంఛనప్రాయంగా నిలిపివేస్తున్నాం. మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించినందుకు అందరికి ధన్యవాదాలు’ అని పమేలా తెలిపింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Love is a risk … ? “Madness is always doing the same thing and waiting for different results. ” A. Einstein

A post shared by The Pamela Anderson Foundation (@pamelaanderson) on

విడిపోతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజునే పమేలా.. తన ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫొటోలను పోస్టు చేసింది. దీనికి ‘ప్రేమ అనేది (Love Is A Risk).. పిచ్చితనం.. అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. మరో ఫొటోలో ప్రతి ప్రేమ వ్యవహారం.. విధిని అడ్డుకునే ఒక ప్రయత్నం వంటిది’ అని రాసుకొచ్చింది.

అండర్సన్, పీటర్ తొలిసారి 30 ఏళ్ల క్రితమే డేటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయి మళ్లీ ఇన్నాళ్లకు కలిసిపోయారు. వీరిద్దరి పెళ్లిళ్లు చేసుకోవడం ఇది ఐదోసారి. అంతకుముందు మొద‌టి ముగ్గురితో పెళ్లి అయ్యాక డివోర్స్ అయింది.

త‌న మూడో భ‌ర్త‌ను రెండు సార్లు పెళ్లాడింది. వీరి తర్వాత పీటర్స్ నాలుగో వాడు. ఇప్పుడు ఇతడితోనూ విడాకులకు సిద్ధమైంది. మళ్లీ పమేలాలో ప్రేమ పుట్టి మళ్లీ ఎవరిని పెళ్లాడుతుందో.. లేదా మనస్సు మార్చుకుని పీటర్స్ తోనే వివాహ బంధం కొనసాగిస్తుందో లేదో చూడాలి.