Pandemic Controlled: పూర్తి వ్యాక్సినేషన్‌తో మహమ్మారిని కట్టడి చేయొచ్చు- స్టడీ

ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి ఒక్కసారిగా పతనం కావడం మొదలైంది. దానికి కారణం బ్రెజిల్ దేశమంతా ప్రయోగాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సక్సెస్ ఫుల్ చేశారు.

Pandemic Controlled: పూర్తి వ్యాక్సినేషన్‌తో మహమ్మారిని కట్టడి చేయొచ్చు- స్టడీ

Pandemic Can Control

Pandemic Controlled: ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి ఒక్కసారిగా పతనం కావడం మొదలైంది. దానికి కారణం బ్రెజిల్ దేశమంతా ప్రయోగాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సక్సెస్ ఫుల్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ అప్రూవల్ చేసుకోవచ్చని అనుమతిచ్చిన చైనీస్ వ్యాక్సిన్ Coronavacను వేసుకున్నారు.

ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లే కాదు.. వ్యాక్సినేషన్ లో పాల్గొనని వారు కూడా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండటంతో ప్రమాదానికి గురి కావడం లేదు. ఈ ప్రయోగం ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో జరిపినట్లు స్టడీ నిర్వహకులు వెల్లడించారు.

95శాతం మందికి వ్యాక్సినేషన్ వేసిన తర్వాత.. ఫలితాలు ఇలా ఉన్నాయి.
* మృతులు 95శాతం తగ్గాయి.
* హాస్పిటలైజేషన్ కేసులు 80శాతం తగ్గాయి.
* లక్షణాలు కనిపించే కేసులు 80శాతం తగ్గిపోయాయి.
* అంతేకాకుండా 20ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి వ్యాక్సిన్ వేయకపోయినా కేసుల నమోదు తగ్గిపోయింది. ఇక దీనిని బట్టి స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరంలేదని రీసెర్చ్ డైరక్టర్ చెప్పారు.

ప్రపంచంలో కరోనావైరస్ ప్రభావానికి గురైన దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ తర్వాత బ్రెజిల్ నిలిచింది. దాదాపు 4లక్షల 63వేల కొవిడ్ మృతులు సంభవించాయి. వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అక్కడ చాలా నిదానంగా జరిగింది. ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నా.. దేశం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది.