Brazil’s Experiment : 75శాతం మందికి వ్యాక్సిన్ వేస్తే..కరోనా కంట్రోల్ లోకి

75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.

Brazil’s Experiment : 75శాతం మందికి వ్యాక్సిన్ వేస్తే..కరోనా కంట్రోల్ లోకి

Brazil Experiment

Brazil’s Experiment 75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది. బ్రెజిల్ లోని సెరెనా మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. చైనాకి చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనావాక్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే బుటన్టాన్ ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో ఈ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

సెరెనా పట్టణంలో 45వేల మంది నివసిస్తుంటారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ “అత్యవసర వినియోగ” ఆమోదం పొందిన చైనీస్ వ్యాక్సిన్ “కరోనావాక్”ని పట్టణంలోని పెద్దలందరికీ ఇచ్చారు. 75శాతం మంది పట్టణ జనాభాకి(18ఏళ్లు పైబడినోళ్లకి)వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి తగ్గడంతో.. వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లు కూడా రక్షణ పొందారని పరిశోధకులు తెలిపారు. సెరెనాలో మరణాల సంఖ్య కూడా 95శాతం పడిపోయిందని తెలిపారు. చాలా ముఖ్యమైన ఫలితం ఏమిటంటే..మొత్తం జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వకుండానే మనం కరోనా మహమ్మారిని నియంత్రించగలము అని రీసెర్చ్ డైరక్టర్ రికార్డో పలాసియోస్ తెలిపారు.

పరికోధకులు తెలిపిన వివరాల ప్రకారం..95% పెద్దలకు పూర్తిగా టీకాలు వేసినప్పుడు ఫలితాలు ఇలా

-మరణాల సంఖ్య 95శాతం పడిపోయింది.
-హాస్పిటల్ పాలయ్యే వాళ్ల సంఖ్య 86శాతం తగ్గింది.
-రోగ లక్షణ కేసులు(Symptomatic Cases)80శాతం తగ్గాయి.

టీకాలు వేయని 20 ఏళ్లలోపు వారిలో కేసుల సంఖ్య కూడా పడిపోయిందని, స్కూళ్లు తిరిగి తెరవడానికి పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం లేదని ఇది సూచిస్తున్నట్లు పలాసియోస్ తెలిపారు. కాగా,ప్రపంచంలో అమెరికా తర్వాత కరోనా ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొన్న దేశం బ్రెజిల్. శంలో రోజువారీ మరణాలు మరియు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బ్రెజిల్ లో ఇప్పటివరకు 4,63,000 కరోనా మరణాలు నమోదయ్యాయి. వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా..బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది.