Home » International » Britainలో నిత్యావసరాల కొరత, Supermarket లకు క్యూ కట్టిన జనాలు
Updated On - 1:56 pm, Thu, 24 December 20
Panic buyers storm UK shops emptying supermarket : కరోనా కొత్త స్ట్రెయిన్ (new variant of coronavirus) దెబ్బకు బ్రిటన్ (UK) గడగడలాడిపోతోంది. ఓ వైపు కేసుల సంఖ్య తగ్గకపోవడం… మరోవైపు కఠిన ఆంక్షలు సాధారణ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇతర దేశాలు తమ సరిహద్దులను మూసివేయడంతో… బ్రిటన్ కు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఫ్రాన్స్ (France) దేశం బోర్డర్లు తెరిచినప్పటికి కరోనా (Corona) పరీక్షల కారణంగా కొన్ని వేల ట్రక్కులు సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో బ్రిటన్లో నిత్యావరసరాల సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఫ్రాన్స్ నుంచి వచ్చే సరుకుల సరఫరా ఆలస్యమవుతోంది.
సాధారణంగా సరిహద్దు దేశాల నుంచి బ్రిటన్ ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లను దిగుమతి చేసుకుంటుంది. తాజాగా కొత్త స్ట్రెయిన్ దెబ్బతో యూకేకు సరుకులు సరఫరా చేసేందుకు అన్నిదేశాలు వెనుకాడుతున్నాయి. అటు బ్రిటన్‌తో రాకపోకలపై నిషేధం కారణంగా సరిహద్దుల్లో అనేక వాహనాలు నిలిచిపోయాయి. మూడ్రోజుల పాటు రోడ్డు మీద ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. బ్రిటన్‌లోని మన్ స్టన్ ఎయిర్ పోర్టు (Britain Manston Airport) సమీపంలో నిలిచిన లారీలు, భారీ రవాణా వాహనాలు కదల్లేదు. అందులోని డ్రైవర్లు కూడా మూడ్రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.
దీనికి తోడు త్వరలో బ్రిటన్ లో లాక్ డౌన్ (britain lockdown) విధిస్తారన్న అనుమానంతో ప్రజలు పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. క్రిస్మస్, న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో ఇంట్లో సరిపడా స్టాక్ పెట్టుకునేందుకు జనం మార్కెట్ల బాట పట్టారు. దీంతో సూపర్ మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు ప్రజలందరూ ఒక్కసారిగా సూపర్ మార్కెట్ల బాట పట్టడంతో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తోన్నాయి.
snake in lettuce : సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన పాలకూరలో పాము
షాపులోకెళ్లి చిప్స్ ప్యాకెట్ చోరీ చేసిన పక్షి
యాప్ లోనే ఆలయ దర్శనం
కరోనా ‘న్యూ వేరియంట్’ విజృంభణ.. Tier-3లోకి లండన్.. కఠిన ఆంక్షలు!
బాగా ఎక్కేసింది : మద్యం స్టోర్ లో మహిళ రచ్చ రచ్చ..లక్షలు విలువచేసే బాటిల్స్ ధ్వంసం
మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ : లిక్కర్ షాపులు వద్ద బారులు తీరిన జనాలు