విడిపించండి అంటూ అమ్మాయి అరుపులు..911కి పక్కింటివాళ్ల కాల్. తీరా చూస్తే?

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 05:25 AM IST
విడిపించండి అంటూ అమ్మాయి అరుపులు..911కి పక్కింటివాళ్ల కాల్. తీరా చూస్తే?

ఫ్లోరిడాలోని ఓ ఇళ్లు. కాపాడండి, రక్షించండి అరుపులు…  పక్కంటాయనికి డౌట్ వచ్చింది. అమ్మాయి కాపాడమని అరుస్తుందని అనుకున్నాడు. అలాగని వెళ్లి చూసే ధైర్యంలేదు. 911 నెంబర్ కి కాల్ చేశాడు. పోలీసులు అరుపులు వినిపించిన ఇంటికి వెళ్ళి చూస్తే….! 

ఓ వ్యక్తి చిలుకను పెంచుకుంటున్నాడు. పేరు ర్యాంబో. చిలుకను మెుదట్లో పంజరంలో ఉంచేవాడు. హెల్ప్ అనడం నేర్పించాడు. ఓనర్ లేనప్పుడు  కాపాడండి, విడిచి పెట్టడండి అని అరవడం చిలుక నేర్చుకుంది. కొన్నేళ్ల తర్వాత చిలుకను పంజరం నుంచి విడిచి పెట్టాడు. అలాగని చిలుక మాత్రం నేర్చుకున్న మాటలను మరిచిపోలేదు.

ఇంట్లోకొచ్చిన పోలీసులకి చిలుక హాయ్, హాలో అంటూ పలకరించింది. అప్పటికిగాని పోలీసులకు అర్ధంకాలేదు…అసలు సంగతేంటో! ఆ మాటలకు పోలీసులకు నవ్వొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్.