Parvati Idol: 50ఏళ్ల నాటి పార్వతి దేవి విగ్రహానికి రూ.కోటి 70లక్షలు

తమిళనాడులోని కుంభకోణంలోని నదనపురేశ్వరార్ శివన్ ఆలయంలో కనిపించకుండాపోయిన పార్వతీ దేవి విగ్రహాన్ని తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. ఈ విగ్రహం దాదాపు అర్ధ శతాబ్దం క్రితం 1971లో దొంగతనానికి గురైంది. న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ వేలం హౌస్‌లో చాలా కాలం క్రితం నుంచే వేలానికి ఉంచినట్లే అధికారులు తెలిపారు.

Parvati Idol: 50ఏళ్ల నాటి పార్వతి దేవి విగ్రహానికి రూ.కోటి 70లక్షలు

Parvati Idol: తమిళనాడులోని కుంభకోణంలోని నదనపురేశ్వరార్ శివన్ ఆలయంలో కనిపించకుండాపోయిన పార్వతీ దేవి విగ్రహాన్ని తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. ఈ విగ్రహం దాదాపు అర్ధ శతాబ్దం క్రితం 1971లో దొంగతనానికి గురైంది. న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ వేలం హౌస్‌లో చాలా కాలం క్రితం నుంచే వేలానికి ఉంచినట్లే అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1971మే 12న ఆలయంలో చోరీకి గురైన ఐదు విగ్రహాలలో పార్వతి విగ్రహం ఒకటి. 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, 2019లో మాత్రమే ఆలయ ధర్మకర్త కె. వాసు కంప్లైంట్‌తోనే మళ్లీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పూజ చేసేందుకు అక్కడికి చేరుకోగా ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూశానని, ఆలయ ధర్మకర్తలు ఇద్దరు నాచియార్‌కోయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

DGP, CID-ఐడల్ వింగ్ జయంత్ మురళి మాట్లాడుతూ ఇలా అన్నారు. “పురావస్తు శాస్త్రవేత్త సహాయం కోరాం. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరిలో పార్వతి విగ్రహాన్ని ఉంచినట్లు చెప్పారు. Bonham వేలం గృహంలో కుంభకోణంలోని నదనపురేశ్వరార్ ఆలయానికి చెందిన అమ్మకానికి ఉందని తెలిసింది.

Read Also : 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..! ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షం..!!

మిగిలిన నాలుగు విగ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.