కరోనా నుంచి తప్పించుకోవడానికి..వీరు ఏం చేశారో తెలుసా

  • Published By: madhu ,Published On : February 23, 2020 / 07:47 AM IST
కరోనా నుంచి తప్పించుకోవడానికి..వీరు ఏం చేశారో తెలుసా

కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇతర దేశాలకు పాకింది. ఆయా దేశాల్లో కూడా మరణాలు సంభవించాయి. దీంతో…ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి చైనా దేశస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కొంతమంది మాస్క్ లు ధరిస్తుంటే..మరికొంత మంది శరీరం కనిపించకుండా..తెల్లటి వస్త్రాలు ధరిస్తున్నారు. చివరకు జంతువులకు కూడా మాస్క్ లు వేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ప్రయాణించిన ఇద్దరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 
ఇద్దరు తమ శరీరాలను పూర్తిగా ప్లాస్టిక్ అవుట్ ఫిట్ తో కప్పేసుకున్నారు.

Read More : అస్మిత పథకం : యాప్ లో రూ.5కే శానిటరీ ప్యాడ్స్
అందులో ఓ మహిళ కూడా ఉంది. ఈమె పింక్ కలర్ లో ఉన్నది ధరించింది. మరొకతను వైట్ కలర్ అవుట్ ఫిట్ ను ధరించాడు. వీరు వేసుకున్న అవుట్ ఫిట్లకు చిన్నపాటి రంధ్రం కూడా లేకపోవడం విశేషం. మరి గాలి ఎలా తీసుకున్నారో అని నెటిజన్లు నోరెళ్ల పెడుతున్నారు. వీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుంటే…మరి ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉన్న ప్లాస్టిక్ అవుట్ ఫిట్లను ధరిస్తే..అసలుకే మోసం వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.