రోగుల నగ్న చిత్రాలను తీసి బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన నర్స్

  • Published By: vamsi ,Published On : May 10, 2019 / 04:46 PM IST
రోగుల నగ్న చిత్రాలను తీసి బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన నర్స్

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చెత్తగా ప్రవర్దించింది ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన మహిళా రోగుల నగ్న చిత్రాలను తీసి తన బాయ్ ఫ్రెండ్‌కి పంపింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నర్స్‌గా పనిచేస్తున్న అశ్లే అన్ స్మిత్(30)  డావోస్ డర్గ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగుల న్యూడ్ ఫోటోలను తీసి వాటిని తన బాయ్‌ఫ్రెండ్‌కి పంపింది.

హాస్పిటల్‌లో చేరిన మహిళ రోగులకు టెస్ట్‌లు టెస్ట్ చేసే సమయంలో వారు సెమీ న్యూడ్‌గా ఉన్నప్పుడు వారి ఫొటోలను తీసి తన బాడ్ ఫ్రెండ్‌కు పంపేది. ఇలా 20మందికి పైగా వ్యక్తుల ఫోటోలు పంపగా వారిలో 10మందికి పైగా ఫోటోలు పూర్తి న్యూడ్‌గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మే 2017 నుంచి మహిళా రోగుల న్యూడ్ ఫొటోలు తీస్తుందని తెలిపిన పోలీసులు తెలిపారు.

నర్స్ పై అనుమానం వచ్చిన ఓ పేషెంట్ ఎప్రిల్ 2019న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నర్స్ తన బాయ్ ఫ్రెండ్‌కు పంపిన న్యూడ్ ఫొటోలలో రెండేళ్ల చిన్నిరి ఫొటో కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.