ప్రజలకు ఎక్కువగా ఇంట్లో నుంచే కరోనా సంక్రమించే అవకాశం, స్టడీ

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 04:06 PM IST
ప్రజలకు ఎక్కువగా ఇంట్లో నుంచే కరోనా సంక్రమించే అవకాశం, స్టడీ

మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్ ప్రపంచం నమ్ముతోంది. ఎవరి ఇంట్లో వారుంటే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వెనుక ఉద్దేశం కూడా అదే. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకండని చెబుతున్నారు. ఇంట్లో ఉంటే సేఫ్ గా ఉంటారని, కరోనా నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు అంతా దీన్నే నమ్ముతున్నారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ నివేదిక వచ్చింది. ప్రజలకు ఎక్కువగా ఇంట్లో నుంచే కరోనా సంక్రమిస్తోంది అనేది ఆ నివేదిక సారాంశం.

ఇంట్లో కుటుంబసభ్యులతో కాంటాక్ట్స్ కారణంగా కరోనా:
బయటివారితో పోలిస్తే ఎక్కువమంది ప్రజలు ఇంట్లో ఉండే సొంత కుటుంబసభ్యుల ద్వారానే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని సౌత్ కొరియాకు చెందిన వ్యాధి నిపుణులు తెలిపారు. ఇంట్లో ఉండే వారితో కాంటాక్ట్స్ కారణంగానే కరోనా సోకుతోందన్నారు. సౌత్ కొరియాలో ఇటీవల ఓ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా కరోనా బాధితులపై రీసెర్చ్ చేశారు. వారికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. బయటి వారితో కాంటాక్ట్స్ కారణంగా కరోనా బారిన పడ్డ వారితో పోలిస్తే, ఇంట్లో కుటుంబసభ్యులతో కాంటాక్ట్స్ కారణంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

5 Cultures Who Celebrate Old Age: What We Can Learn from Them

కరోనా బాధితుల్లో ఎక్కువగా పిల్లలు, వృద్ధులే:
59వేల మంది కరోనా బారిన పడగా, వారిలో వందలో ఇద్దరు మాత్రమే ఇంటి బయటి వారితో కాంటాక్ట్స్ కారణంగా కరోనా బారిన పడ్డారు. కాగా, ప్రతి పది మందిలో ఒకరు ఇంట్లో వారితో కాంటాక్ట్స్ కారణంగా కరోనా బారిన పడినట్టు స్టడీలో తేలింది. అంటే ఇంటి ద్వారానే కరోనా సోకిందన్న మాట. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా పిల్లలు, వృద్దులు ఉన్నారు. దీనికి కారణం పిల్లలు, వయో వృద్ధులు కుటుంబసభ్యులతో క్లోజ్ కాంటాక్ట్ లో ఉండటమే. రక్షణ లేదా అవసరం.. కారణంగా ఆ రెండు గ్రూపుల వాళ్లు కుటుంబసభ్యులతో క్లోజ్ గా కాంటాక్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అడల్ట్స్ తో పోలిస్తే పిల్లల్లో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించవు. దీంతో కరోనా సోకిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోందని, కేసులు వేగంగా పెరగడానికి దారి తీస్తోందని నిపుణులు వాపోయారు.

corona-world

ఇల్లు పదిలం కాదా?
ఇన్నాళ్లు ఇల్లు సేఫ్ అని అంతా అనుకుంటున్నాం. ఇంట్లో ఉంటే కరోనా రాదని ధీమాగా ఉంటున్నాం. కానీ సౌత్ కొరియాలో వెలుగుచూసిన అధ్యయనం షాక్ కి గురి చేస్తోంది. బయటివారితో పోలిస్తే ఇంట్లో వాళ్లతో కాంటాక్ట్స్ కారణంగానే ఎక్కువగా కొవిడ్ సంక్రమిస్తోంది అనే నిజం కొత్త భయాలకు, ఆందోళనలకు తెరతీసింది. ఈ అధ్యయనం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంటే, ఇకపై ఇంట్లో ఉన్నా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.