గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ డైనోసార్ గేమ్ కాదని మీకు తెలుసా?

  • Published By: sreehari ,Published On : February 17, 2020 / 07:46 PM IST
గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ డైనోసార్ గేమ్ కాదని మీకు తెలుసా?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ నిలిచిపోయినప్పుడు ఒక డైనోసార్ కనిపిస్తుంది ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా చాలామందికి క్రోమసౌరాస్ అనే గేమ్ ఒకటి ఉందని తెలుసు. ఇంటర్నెట్ కనెక్టవిటీ నిలిచిపోయినప్పుడు ఈ డైనోసార్ దర్శనమిస్తుంది. నెట్ పోయిందని బోరుగా ఫీల్ కాకుండా ఉండేలా ఈ గేమ్ డిజైన్ చేశారు. ఇంటర్నెట్ కనెక్టవిటీ యాక్సస్ చేసుకునేంతవరకు యూజర్లు కాసేపు డైనోసార్ గేమ్ తో కాలక్షేపం అవుతుంది.

మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ పేజీలో space bar ఎంటర్ చేశారా? అప్పుడు మీకు ఒక్కసారిగా ఒక డైనోసార్ ప్రత్యక్షమవుతుంది చూశారా? ఇదొక గేమ్ అనమాట. స్పేస్ బార్ నొక్కగానే ఆట మొదలువుతుంది. వాస్తవానికి గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ డైనోసార్ గేమ్ ఆట కానే కాదనే విషయం చాలామందికి తెలియదు. క్రోమ్ ఇంటర్నెట్ డైనాసోర్ ఒక ఆట కానే కాదు అనే విషయాన్ని చాలామంది ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు.

ఎడమ నుంచి కుడికి డైనోసార్ పరిగెత్తుతూ వెళ్తుంది. మార్గం మధ్యలో స్పైకీ మొక్కలు వస్తుంటాయి. అప్పుడు డైనాసోర్ పైకి ఎగరాలి.. అప్పుడే ఆట ముందుకు కొనసాగుతుంది. ఒకవేళ సరైన సమయంలో స్పెస్ బార్ నొక్కకపోతే చెట్లకు డైనాసోర్ తగిలి ఆట ముగిసిపోతుంది.

డైనాసోర్ పరిగెత్తే సమయంలో పైనా డిజిట్స్ కూడా మారిపోతుంటాయి. ఈ గేమ్ క్రియేట్ చేసిన క్రియేటర్లలో ఒకరైనా ఎడ్వర్డ్ జంగ్ మాట్లాడుతూ.. ‘మేం దీన్ని సుమారు 17 మిలియన్ సంవత్సరాల నాటి టి-రెక్స్ బుల్డ్ చేశాం. అదే సమయంలో టి-రెక్స్ భూమిపై సజీవంగా ఉంది. కానీ, మీ స్పేస్ బార్ తర్వాత ఒకేలా ఉండొకపోవచ్చునని మాకు అనిపిస్తుంది’ అని తెలిపారు.

ఈ డైనోసార్ గేమ్ 2014లో బ్రౌజర్ లో ప్రారంభమైంది. ఈ గేమ్ ను ప్రతి నెలా 270 మిలియన్ల సార్లు ఆడతారు. జురాసిక్ జంపింగ్ ఆట ఆడేవారు మనలో చాలామంది ఆడే ఉండి ఉంటారు. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉంటే.. ఈ డైనోసార్ గేమ్ ఆడటం ఎలా అని ఆందోళనపడకండి..

ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా హాయిగా ఈ జురాసిక్ జంపింగ్ గేమ్ ఆడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. chrome://dino/ అని అడ్రస్ బార్ లో ఎంటర్ చేయండి.. చాలు.. మీకు డైనోసర్ గేమ్ ఆడుకోవచ్చు. ఈ ఆటకు సంబంధించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.