ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారిలో కొవిడ్-19 నిరోధకత ఎక్కువ : రీసెర్చర్లు 

  • Published By: srihari ,Published On : June 9, 2020 / 10:11 AM IST
ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారిలో కొవిడ్-19 నిరోధకత ఎక్కువ : రీసెర్చర్లు 

ప్రపంచమంతా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాప్తి రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. కొత్త కరోనా వైరస్ ప్రభావం లేని సురక్షితమైన ప్రాంతాల కోసం వెతుకుతున్నారు. మందు లేని కరోనాతో పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏది ఏమైనా, ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి కంటే ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారికి కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది పరిశోధకులు గుర్తించారు. లోతట్టు ప్రాంతాల వారితో పోలిస్తే ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండేవారికి కరోనా వ్యాప్తి స్వల్ప స్థాయిలో ఉంటుందని అంటున్నారు. 

ఎత్తైన ప్రాంతాల్లో (3000 మీటర్లు సముద్ర మట్టానికి పైనా) కొవిడ్-19 కేసులు నమోదైన వారిని లోతట్టు ప్రాంతాల్లోని వారితో పోలిస్తే.. దక్షిణ అమెరికాలోని బొలివియా, ఈక్వేడర్, టిబేట్ లోతైన ప్రాంతాల్లో కరోనా కేసుల రేటు చాలా వ్యత్యాసం ఉందని రీసెర్చర్లు వెల్లడించారు.
sea level

బొలివియా లోతట్టు ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ల రేటు కంటే.. ఎత్తైన ప్రాంతాల్లో మూడు రెట్లు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈక్వెడార్ లో కూడా నాలుగు రెట్లు తక్కువగా ఉంటుందని రివీల్ చేశారు. వేహాన్ సిటీకి 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబేట్ ప్రాంతంలోనూ పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. దీనికి కారణం అది ఎత్తైన ప్రదేశం కాగా టిబేట్ తో కలిసిన plateau ప్రాంతంలో 134 కేసులు ధ్రవీకరించాయి. 

కరోనా ప్రభావానికి కారకాలేంటి? :
ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వారికి తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. అందులోనూ స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జీవావరణంతో కప్పి ఉండటంతో స్వచ్ఛమైన గాలి, మంచి ఆక్సిజన్  రవాణా చేసుకోవచ్చు. లోతైన ప్రాంతాల్లో ఉండేవారితో పోలిస్తే ఎత్తైన ప్రదేశాల్లో ఉండేవారిలో అల్ట్రా వాయిలెట్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుందని ఇదే.. కరోనా నిరోధించే ప్రకృతి సిద్ధమైన శానిటైజర్ గా పనిచేస్తోందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. DNA, RNA పరమాణు బంధాలను సైతం విచ్ఛిన్నం చేయగలదని తెలిపారు.  Bolivia’s High Altitude Pulmonary and Pathology Institute డైరెక్టర్ అధ్యయనంలో సహా పరిశోధకులు Gustavo Zubieta-Calleja చెప్పిన ప్రకారం.. సముద్ర మట్టపు ప్రాంతంలో నివసించే వారిలో కరోనా వైరస్ సోకి ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని అన్నారు. 
sea levels

ఎందుకంటే.. ఒకవేళ ఎవరెస్ట్ పర్వతాన్ని ఆక్సిజన్ లేకుండా కొన్నిరోజుల ఎక్కేందుకు ప్రయత్నిస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. కానీ, ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారిలో మాత్రం భౌతికంగానే రక్తంలోనే తక్కువ స్థాయి ఆక్సిజన్ ద్వారా వెంటిలేషన్ అందుతుందని తెలిపారు. వాస్తవానికి కరోనా నివారించాలంటే.. సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత శుభ్రత, చేతులు తరచూ కడుక్కోవడం అనేది ప్రతిఒక్కరి జీవన విధానంలో ఒక భాగమై పోవాలని అప్పుడే కరోనా నుంచి సురక్షితంగా బయటపడొచ్చునని రీసెర్చర్లు సూచించారు.  

Read: లక్షణాల్లేకుండా వైరస్ ఉండడం చాలా అరుదు: WHO