Permanent work from home ఉద్యోగులను చెడగొడుతుంది: Nadella

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 09:20 AM IST
Permanent work from home ఉద్యోగులను చెడగొడుతుంది: Nadella

ట్విట్టర్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇళ్ల నుంచి పనిచేయించుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా చేసుకుంటూ పోతే ఉద్యోగుల మైండ్ సెట్ మారిపోతుందని.. తద్వారా సీరియస్ పరిణామాలు చోటు చేసుకుంటాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వర్చువల్ వీడియో కాల్స్ పర్సనల్ మీటింగ్ స్థానాన్ని భర్తీ చేయలేవని అన్నారు. 

న్యూ యార్క్ టైమ్స్ అనే ఇంగ్లీష్ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెళ్ల ఇలా మాట్లడారు. ‘ఒకటి కాదనుకుంటే మరొకటి. మనిషిక భావోద్వేగాలు ఏంటి?  మానసిక ఆరోగ్యం ఏంటి?  కమ్యూనిటీ బిల్డింగ్ కనెక్టివిటీలు ఏంటి? వీటిల్లో నేను ఒకటే అనుకుంటా. ఏదో కొంత సంపాదించుకుంటున్నాం. ఎక్కడికక్కడ పనిచేసుకుంటున్నాం. అయితే ఈ సంపాదనను ఎలా లెక్కిస్తాం. 

ఆర్థికంగా సంపాదించుకుంటున్నామా.. సామాజిక బంధాలు పెంచుకుంటున్నామా అనే ప్రశ్నను వదిలేశారు నాదెళ్ల. శాశ్వతంగా =ఇళ్ల నుంచి పనిచేస్తే  ఉద్యోగుల వైఖరి మారిపోతుందని.. ప్రవర్తనలో మార్పు వస్తే ఆ లోటు తీర్చలేమని అన్నారు. మైక్రోసాఫ్ట్ అక్టోబరు వరకూ ఇళ్ల నుంచే పనిచేసుకోమని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇచ్చేసింది. ఈ ఏడాది ఆ సంస్థ లాభాలు గతేడాదితో పోలిస్తే 30శాతం అధికంగానే కనిపిస్తున్నాయి. 

ఏదేమైనా మేం క్రియేటివ్, పార్టనర్, విజ్ఞాన వంతంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం. మేము చిన్నపాటి వ్యాపారాలకు, ఆర్గనైజేషన్లకు సాయం చేసినవాళ్లం అవుతామని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. మైక్రోసాఫ్ట్ గత వారం లండన్ కు చెందిన మెటాస్విచ్ నెట్‌వర్క్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 

Read: ఇంటి అద్దె కట్టలేక వలస కార్మికుడి సూసైడ్