కరోనాతో బాధపడుతూ 222 రోజులు ఆస్పత్రిలోనే..

కరోనాతో బాధపడుతూ 222 రోజులు ఆస్పత్రిలోనే..

person hospitalized for 222 days suffering from corona : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే, కరోనా దీర్ఘకాలిక లక్షణాలున్నవారు కూడా ఒక నెలకంటే ఎక్కువ ఆస్పత్రిలో చికిత్స పొందలేదు.

కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 222 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ మహమ్మారితో అత్యధిక కాలం బాధపడ్డ వ్యక్తి ఇతడేనట. క్రిస్మస్‌కు కొద్దిరోజులముందే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యూకేకు చెందిన 57 ఏళ్ల అలీ సకల్లియోగ్లూ కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా 222 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది మూడుసార్లు అతడిపై ఆశ వదులుకోవాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.

లైఫ్‌ సపోర్ట్‌ మెషీన్లను ఆపివేశారు. ఇప్పుడు అతడు కరోనాను జయించి ఇంటికి చేరాడు. పండుగకు కొద్దిరోజులముందే అతడు కరోనాపై విజయం సాధించి ఇంటికి తిరిగిరావడంతో ఇదంతా క్రిస్మస్‌ మిరాకిల్‌ అని కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారు.