Pfizer Moderna Vaccines : గుడ్ న్యూస్.. ఆ రెండు కరోనా వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయి.. తొలి డోసుకే 80శాతం రక్షణ

అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ల గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ కంపెనీల వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తేలింది. అంతేకాదు మొదటి డోసుకే కొవిడ్‌ ముప్పును..

Pfizer Moderna Vaccines : గుడ్ న్యూస్.. ఆ రెండు కరోనా వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయి.. తొలి డోసుకే 80శాతం రక్షణ

Pfizer Moderna Vaccines

Pfizer Moderna Vaccines : అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ల గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ కంపెనీల వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తేలింది. అంతేకాదు మొదటి డోసుకే కొవిడ్‌ ముప్పును 80 శాతం దూరం చేస్తాయని నిర్ధరణ అయ్యింది. ఇక రెండు డోసులు తీసుకున్న వారిలో 90శాతం వైరస్‌ ముప్పును నివారిస్తున్నాయి. ఈ మేరకు రియల్‌ వరల్డ్‌ అనే సంస్థ తమ పరిశోధనలోని వివరాలు వెల్లడించింది. అమెరికాలో అనుమతి పొందిన వ్యాక్సిన్ల రక్షణ సామర్థ్యంపై.. టీకా తీసుకున్న దాదాపు 4వేల మందిపై రియల్ వరల్డ్ పరిశోధన నిర్వహించింది.

‘ఫైజర్‌, మోడెర్నా టీకాలు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. తొలిడోసు మాత్రమే తీసుకున్న వారిలో 80శాతం మేర ముప్పును తగ్గిస్తున్నాయి. తొలి డోసు టీకా తీసుకున్న వెంటనే యాంటీ బాడీలు పెరుగుతున్నాయి. ఇక రెండు డోసులు తీసుకున్న వారిలో 90శాతం వైరస్‌ ముప్పును నివారిస్తున్నాయి’ అని రియల్‌ వరల్డ్‌ పరిశోధన తెలిపింది. ఈ అధ్యయనంలో ఆరు రాష్ట్రాలకు చెందిన టీకా తీసుకున్న 3వేల 950 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 13 వారాల పాటు పాల్గొన్నారు.

ఈ తాజా పరిశోధన నివేదికపై అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ‌( సీడీసీ) డైరెక్టర్‌ రోచెల్‌ వాలెన్‌స్కీ స్పందించారు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న వ్యాక్సినేష‌న్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, ప్రజలకు కరోనా దూరం చేస్తోందని ఈ అధ్యయనం ద్వారా నిరూపితమవుతోందని చెప్పారు. ఫైజర్ సంస్థ మెసింజర్ ఆర్ఎన్ఏ విధానంలో వ్యాక్సిన్ ను రూపొందించిందని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఈ వ్యాక్సిన్ కే తొలుత వాడకానికి అనుమతి లభించిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ కల్పించడంతో పాటు, వైరస్ శరీరంలోకి వెళితే, లక్షణాలను కూడా బయటకు కనిపించనివ్వడం లేదని రియల్ వరల్డ్ వెల్లడించింది.

డిసెంబర్ 14 నుంచి 13 వారాల పాటు సాగిన ఈ అధ్యయనం, మార్చి 13 వరకు సాగింది. మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి టీకా తీసుకున్న వారిలో 3,950 మందిని పరిశీలించారు. ఈ టీకా అమెరికాలోని హెల్త్ కేర్ పర్సనల్స్, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్, వయో వృద్ధులకు కొవిడ్ నుంచి నిజమైన రక్షణను అందిస్తోందని వాలెన్ స్కీ అన్నారు. కాగా, అమెరికాలో ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం నిమిత్తం వాడేందుకు అనుమతి లభించగా, అప్పటి నుంచి భారీ ఎత్తున ప్రజలకు ఇస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ ను అత్యంత శీతల ప్రదేశంలో భద్రపరచాల్సి ఉండటంతో భారత్ సహా ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ సరఫరా కష్టమన్న ఉద్దేశంతో దూరం పెట్టాయి. కరోనావైరస్ నివారణకు అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్లు తయారు చేశాయి.