Pfizer Covid Mutations : కరోనా కన్నా డేంజరస్ వైరస్ మ్యుటేషన్లు తయారీ.. అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ దుర్మార్గం

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఫైజర్. అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ తయారు చేసిన మందులు అమ్ముడవుతూనే ఉంటాయి. క్వాలిటీకి ఆ కంపెనీ మారుపేరు అన్న ప్రచారమూ ఉంది. కానీ, ప్రాజెక్ట్ వెరిటాస్ అనే ఇన్వెస్టిగేషన్ మీడియా కంపెనీ బయటపెట్టిన ఓ వీడియో ఇప్పుడు ఫైజర్ ను వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మార్చేసింది.

Pfizer Covid Mutations : ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఫైజర్. అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ తయారు చేసిన మందులు అమ్ముడవుతూనే ఉంటాయి. క్వాలిటీకి ఆ కంపెనీ మారుపేరు అన్న ప్రచారమూ ఉంది. కానీ, ప్రాజెక్ట్ వెరిటాస్ అనే ఇన్వెస్టిగేషన్ మీడియా కంపెనీ బయటపెట్టిన ఓ వీడియో ఇప్పుడు ఫైజర్ ను వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మార్చేసింది.

వ్యాక్సిన్, యాంటీ వైరల్ డ్రగ్స్ టెస్టింగ్ పేరుతో అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ ను తన ల్యాబ్ లోనే సృష్టించింది ఫైజర్ కంపెనీ. ఈ వైరస్ కనుక బయటకు లీక్ అయితే ఏమవుతుందో అనే భయాందోళన సర్వత్రా నెలకొంది.

కోవిడ్ తో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. ఈ మహమ్మారి దెబ్బకు మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఫైజర్ నుంచి లీక్ అయిన న్యూస్ మళ్లీ వరల్డ్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. కోవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకై ఉండొచ్చు అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు దాని కన్నా ప్రమాదకరమైన మ్యుటెంట్ ఫైజర్ ల్యాబ్ లో ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read..China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

ఈ మ్యుటెంట్ ను జనంపైకి వదలడానికే తయారు చేసి ఉండొచ్చని, జనం ప్రాణాలు పోతుంటే దానికి మెడిసిన్లు విడుదల చేసి కోట్లకు కోట్లు కొల్లగొట్టవచ్చన్న ప్లాన్ ఫైజర్ కి ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ వైరస్ కు సంబంధించిన పూర్తి డేటా అప్పటికే ఫైజర్ కంపెనీ దగ్గర ఉంటుంది. దానిపై ఎలాంటి మందు పని చేస్తుందన్నది కూడా ఒక్క ఫైజర్ కంపెనీకే తెలుస్తుంది. మిగిలిన కంపెనీలు ప్రయోగాలు మొదలు పెట్టేసరికి మెడిసిన్ రిలీజ్ చేసే అవకాశం ఒక్క ఫైజర్ కు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ మెడిసిన్ అవసరం అవుతుంది. అప్పుడు ఆ కంపెనీ ఎంత రేటు చెబితే అంతకు అందరూ కొనాల్సి వస్తుందన్నది ఇప్పుడు ఫైజర్ పై వస్తున్న ఆరోపణ.

ఫార్మా రంగంలో ఇలాంటివి తరుచూ జరుగుతుండటంతో ఫైజర్ పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్, వ్యాక్సిన్ల అమ్మకాల కోసం ఔషధ కంపెనీలు ఎంత నీచానికైనా దిగజారతాయి అనడానికి ఇదొక ఉదాహరణ అంటోంది ప్రాజెక్ట్ వెరిటాస్. ఫైజర్ సహా అనేక సంస్థలు తయారు చేసి పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్లు, వాటి దుష్పరిణామాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘోరం వెలుగుచూసింది.

దీంతో వ్యాక్సిన్ల అమ్మకాల కోసం ఔషధ కంపెనీలు ఎంతకైనా తెగిస్తాయన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. శవాలపై పేలాలు ఏరుకునే రకంగా ఫైజర్ పని తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైజర్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ డైరెక్టర్ జోర్డాన్ క్రిస్టన్ వాకర్ ను ఇంటర్వ్యూ చేసిన ప్రాజెక్ట్ వెరిటాస్ ప్రతినిధులు ఈ విషయాన్ని రాబట్టారు. వ్యాక్సిన్లపై ఎలాంటి పరిశోధనలు సాగుతున్నాయన్న దానికి సమాధానంగా తామే ఒక కొత్త కోవిడ్ మ్యుటెంట్ ను ల్యాబ్ లో సృష్టించామన్నారు.

Also Read..Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నరేడియోధార్మిక క్యాప్సూల్.. దానిని తాకొద్దంటూ అధికారుల హెచ్చరికలు

కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ ముట్యేషన్లు ఫైజర్ తయారు చేసినట్లు తెలిపే వీడియో బయటకు రావడంతో దుమారం రేగింది. ఫైజర్ కంపెనీ నిజం ఒప్పుకోక తప్పలేదు. కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్ పై తాము పరిశోధనలు జరుపుతున్నామని ఫైజర్ అంగీకరించింది. అయితే కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి కోసమే వైరస్ ను మ్యుటెంట్ చేసినట్లు ఫైజర్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం వైరస్ పరిణామక్రమంపై పరిశోధనలు జరపలేదన్నారు. ప్రస్తుతం యాంటీ వైరల్ డ్రగ్, ప్యాక్స్ లోవిడ్ టెస్టింగ్ కోసం మ్యుటేషన్లు చేశామని తెలిపారు.

యాంటీ వైరల్ డ్రగ్స్ ను పరిశీలించేందుకే మ్యుటేషన్లు అభివృద్ధి చేశామని ఫైజర్ చెబుతున్నప్పటికీ.. మందుల అమ్మకాలు, లాభాల కోసమే దీన్ని సృష్టించి ఉండొచ్చన్న ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది బయటకు రావడం ప్రమాదకరం అని, వుహాన్ వైరస్ తరహాలో ఏమైనా జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు రావడంతో ఫైజర్ డైరెక్టర్ జోర్డాన్ క్రిస్టన్ వాకర్ పై అమెరికాలో ఓ పిజ్జా సెంటర్ లో దాడి జరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా కంపెనీ ఫైజర్. జర్మనీ సంస్థ బయో ఎన్ టెక్ కంపెనీతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ వ్యాక్సిన్ అమ్మకాల ద్వారానే 2021లో దాదాపు 3వేల 680 కోట్ల డాలర్లను అర్జించింది ఫైజర్. మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ ఏకంగా 3లక్షల కోట్ల రూపాయలు.

ఇక ఫైజర్ ఆదాయంలో దాదాపు 58శాతం కేవలం వ్యాక్సిన్ అమ్మకాల ద్వారానే వస్తోంది. ఇక ఆదాయం కోసం ఫైజర్ అడ్డదారులు తొక్కుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అనైతిక మార్కెటింగ్ విధానాలను అవలంభించినందుకు ఎన్నో కేసులు ఎదుర్కోంటోంది. అందుకే, ఇప్పుడు ఫైజర్.. కోవిడ్ వైరస్ మ్యుటేషన్ సృష్టించింది అనగానే అనుమానాలు మరింత పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు