కొవిడ్ టైంలో వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇదే..

కొవిడ్ టైంలో వాలెంటైన్స్ డే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇదే..

Pfizer valentine’s day: కొవిడ్-19 సమయంలో పర్ఫెక్ట్ గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నారా.. ఇదిగో మీ కోసం ఇదే పర్ఫెక్ట్ గిఫ్ట్ అని కొవిడ్ వ్యాక్సిన్ యాడ్‌ను రిలీజ్ చేసింది ఫైజర్. అమెరికన్ టీవీ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ పారడీ ట్వీట్‌కు కామెంట్‌గా.. ఇలా రాశారు. వాలెంటైన్స్ డే కోసం ఒక్క షాట్ చాలు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మనిషి తన పార్టనర్ కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది కూడా చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుని తన ముందుంచుతాడు. అది ఓపెన్ చేసి చూసేసరికి కొవిడ్ ఫైజర్ వ్యాక్సిన్. అప్పుడు వెనుక నుంచి వాయీస్ ఓవర్ వినిపిస్తుంది. తన కోసం ఒకరిలా కాదు.. తన యాంటీబాడీలా ఉండమని.

వీడియో పూర్తి అయ్యేసరికి కొవిడ్ 19 వ్యాక్సిన్ టీకాలు వేయించుకోండి. అని వస్తుంది. కాకపోతే ఇది భళే కామిక్ టర్న్ తీసుకుంది. అందులో వినిపించే మరొక మాట ఫైజర్ వ్యాక్సిన్ ప్రతిచోట దొరకదని. ఈ యాడ్ ఇండియన్ బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్రా కూడా నచ్చింది. తానే స్వయంగా స్పందించి షేర్ చేశారు.

వ్యాక్సిన్ అనేది ఇక ఎప్పటికీ ఉంటుంది అని ట్వీట్ చేశారు. దాంతో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదార్ పూనావాలాను కూడా ట్యాగ్ చేశారు. ఉల్లాసంగా ఉంది ఈ యాడ్. రెడీమేడ్ యాడ్ మీకు దొరికేసిందని కామెంట్ చేశారు.