Philippines Ferry Fire: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం.. ఫెర్రీలో చెలరేగిన మంటలు 12 మంది మృతి ..

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాసిలాన్ ప్రావిన్స్‌లోని బ్లాక్ ద్వీపం వద్ద ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 12మంది ప్రాణాలు కోల్పోయారు. 230 మందిని రక్షక బృందాలు కాపాడాయి. మరో ఏడుగురు ఆచూకీ లభించలేదు.

Philippines Ferry Fire: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం.. ఫెర్రీలో చెలరేగిన మంటలు 12 మంది మృతి ..

Philippines Ferry Accident

Philippines Ferry Fire: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లేడీ మేరీ జాయ్3 మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళ్తున్న సమయంలో ఫెర్రీ బోటులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని 12 మంది మరణించారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు తెలిసింది. 14 మందికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది ప్రయాణికులు నీటిలోకి దూకినట్లు విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు.

Philippines Floods: ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు.. 20మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సమాచారం అందుకున్న ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులతో సహా‌రక్షకులు సహాయక చర్యలు చేపట్టి 230 మందిని కాపాడారు. వీరిలో 195మంది ప్రయాణీకులు ఉండగా, 35 మంది సిబ్బంది ఉన్నారు. అయితే మరో ఏడుగురు ఆచూకీ లభించలేదని నిక్సన్ అలోంజో తెలిపారు. ఏడుగురు నీటిలో మునిగి ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 12 మంది మృతుల్లో ఆరునెలల పాపతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

ఫెర్రీలో మంటలు ఎందుకు వ్యాపించాయనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటల్లో సగానికిపైగా కాలిపోయిన ఫెర్రీని బాసిలన్ తీరానికి తీసుకొచ్చారు. ఫిలిప్పీన్స్ 7వేల కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీప సమూహం. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తరచూ అక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి.