12ఏళ్ల చిన్నారుల విషయంలో వివాదాస్పద చట్టం..వ్యతిరేకిస్తున్న బాలల హక్కుల సంఘాలు

12ఏళ్ల చిన్నారుల విషయంలో వివాదాస్పద చట్టం..వ్యతిరేకిస్తున్న బాలల హక్కుల సంఘాలు

philippines : sex with 12 year olds is legal : ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఓ వివాదాస్పద చట్టానికి ఆమోదం పలికింది. 12 ఏళ్ల వయస్సున్న చిన్నారులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చని తెలిపింది. ఇరువురికి అంగీకారం అయితే 12 సంవత్సరాల వయసు నుంచి లైంగిక సంబంధం పెట్టుకోవచ్చనే చట్టానికి ఆమోదం పలికింది. ఈ చట్టంపై బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత తక్కువ వయసు నిబంధన అనేది లేకపోవటం గమనించాల్సిన విషయం.

ఫిలిప్పీన్స్​లో మతపరమైనమ్మకాలు ఎక్కువ కలిగిన క్యాథలిక్ దేశం. ఆ దేశంలో విడాకులు తీసుకోవడం చట్ట విరుద్ధం (ఫిలిప్పినో ముస్లింలు మినహా). ఈక్రమంలో తక్కువ వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకునే కోరిక తీర్చుకోవాలన్న స్పానిష్ వలసవాదులు ప్రేరేపిస్తే తెచ్చిన చట్టంగా తక్కువ వయసు సెక్స్ నిబంధనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఇంత తక్కువ వయసులో సెక్స్​లో పాల్గొనడాన్ని చట్టంబద్ధం చేయడం వల్ల ఎంతో మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారని ఫిలిప్పీన్స్ లోని బాలల హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళల కంటే బాలికలపైనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై వేధింపులు ఎక్కువవుతున్నాయనే ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసి కూడా ఇటువంటి చట్టానికి ఆమోదం పలకటం ఏంటంటూ విమర్శిస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా ఇటువంటి కేసులు పెరుగుతున్నాయని..ఇక కరోనా వల్ల వచ్చిన లాక్​డౌన్ సమయంలో బాలలపై మరింత ఎక్కువగా లైంగిక వేధింపులు..అత్యాచారాలు పెరిగాయని తెలిపారు.

చిన్న వయసు వారితో సెక్స్​ను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తే రేప్ కేసులను త్వరగా విచారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే కోర్టు రూమ్​లో క్రాస్ ఎగ్జామినేషన్ నుంచి పిల్లలను కాపాడవచ్చని, ప్రస్తుతం దీనిద్వారా చాలా మంది ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని సేచ్ ఫిలిప్పీన్స్​ చిల్డ్రన్ చారిటీ ప్రతినిధి అల్బెర్టో మయోట్ అన్నారు.

అయితే ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈ సమస్యలపై అక్కడి రాజకీయ నాయకులు ఈ విషయంపై దృష్టిసారించారు. సెక్స్​లో పాల్గొనే చట్టబద్ధ వయసును 12 నుంచి 16కు పెంచే బిల్​ను చట్టసభ ప్రతినిధులు ఆమోదించారు. 207 మంది దీనికి మద్దతుగా ఓటు వేసి ఆమోదం తెలిపారు. మరో ముగ్గురు మాత్రం దీన్ని వ్యతిరేకించారు.