అయ్యో పాపం… ఫుడ్ లేక ఎముకల గూడులా మారిన సింహాలు

  • Published By: venkaiahnaidu ,Published On : January 22, 2020 / 09:50 AM IST
అయ్యో పాపం… ఫుడ్ లేక ఎముకల గూడులా మారిన సింహాలు

మాములుగా సింహం అంటే రాజసానికి నిలువుట్టం అని తెలిసిందే. చాలా బలంగా,దిట్టంగా ఉంటాయి సింహాలు. సింహాం గాండ్రిస్తే చాలు దరిదాపుల్లోకి రావడానికి కూడా అందరూ భయపడతారు. అడవికి సింహం రారాజు. అటువంటి సింహంని దగ్గరకి వెళ్లి టచ్ చేయాలంటే ఎవరైనా బయపడతారు. సింహాల్లో ఆఫ్రికా జాతి సింహాలకు అయితే ఓ రేంజ్‌లో పేరుంది. అయితే ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని అల్ ఖురేషీ పార్క్‌లోని సింహాలను చూస్తే అవి సింహాలేనా అనే అనుమానం కలగక మానదు. అవి సింహాలా లేక బక్కచిక్కిన పిల్లులా అన్న అనుమానం రాక తప్పదు. అంతలా వీటి రూపు రేఖలు మారిపోయాయి. ఈ సింహాలను చూస్తే భయం సంగతి అటుంచితే జాలి కలిగి అయ్యోపాపం అంటారు. 

	L1.JPG

ప్రస్తుతం సుడాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటోంది. దీంతో ఆహార ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాదు కరెన్సీ కొరత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సూడాన్‌లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవులా కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్ లోని అల్ ఖురేషి పార్క్ లోని సింహాలకు కొన్ని వారాలుగా తినేందుకు ఆహారం లేదట. అంతేకాదు అనారోగ్యంకు గురైన సింహాలకు సరైన చికిత్స,మెడిసిస్స్ కూడా అందుబాటులో లేవు. దీంతో పార్క్ లోని ఆఫ్రికా సింహాల ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొస్తున్నాయి. సింహాలు ఎముకల గూళ్లలా తయారయ్యాయి. ఓ రేంజ్‌లో ఉండే ఆఫ్రికా జాతి సింహాలేనా ఇవి అని అనిపించేలా అవి ఉన్నాయి. 

ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సందర్శకులు వీటి పరిస్థితి చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సింహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పార్కును జంతు ప్రేమికులు , జర్నలిస్టులు సందర్శించారు. ఇక్కడ వారికి బాధాకరమైన దృశ్యాలు కనిపించాయి. సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవనేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక సింహంను తాడుతో కట్టివేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడక్కడ కుల్లిన మాంసం కనిపించిందని చెప్పారు. ఇక పార్కు పరిసరాలు శుభ్రంగా కనిపించకపోవడంతో సింహాలు తరచూ అనారోగ్యంకు గురవుతున్నట్లు వారు తెలిపారు.

 

ఈ సింహాలను వెంటనే మరో చోటికి తరలించాలని జంతు ప్రేమికులు, జర్నలిస్టులు కోరుతున్నారు. ఉస్మాన్ సలీహ్‌ అనే జంతు ప్రేమికుడు ఫేస్‌బుక్ ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఈ సింహాల పరిస్థితిని చూసి తనకు ఎంతో జాలి వేసిందని ఉస్మాన్ తెలిపాడు. జంతు ప్రేమికులు ఈ సింహాలను ఆదుకోవాలని సహాయం అర్థించాడు.  ఇదిలావుండగా చాలా సింహాలు సగానికి పైగా బరువు తగ్గాయని పార్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా సింహాలు తినేందుకు ఆహారం లేదని, తమ సొంత జేబుల్లో నుంచి వాటి ఆహారం కోసం ఖర్చు చేస్తున్నట్లు పార్కు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికా సింహాల సంఖ్య విపరీతంగా పడిపోయింది. 1993 నుంచి 2014కు 43శాతం సింహాలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం 20వేల సింహాలు మాత్రమే బతికి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.