గాల్వాన్ ఘర్షణలు..చైనా సైనికుడి మరణం..సాక్ష్యమిదిగో

  • Published By: madhu ,Published On : August 29, 2020 / 09:56 AM IST
గాల్వాన్ ఘర్షణలు..చైనా సైనికుడి మరణం..సాక్ష్యమిదిగో

భారత భూబాగంలోకి చొచ్చుకొని వచ్చి..కవ్వింపు చర్యలకు పాల్పడి..20 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా..కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



2020, జూన్ 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయ వద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించారు. ఎంత మంది చనిపోయారో భారత్ ప్రకటిస్తే…చైనా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

భారత జవాన్ల దెబ్బకు, వీర పోరాటానికి పలువురు చైనా సైనికులు మరణించారని వార్తలు వెలువడ్డాయి. కానీ దీనిపై చైనా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా..చైనా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.



చైనా చెందిన చెన్ షియాంగ్ర్ అనే సైనికుడి సమాధి ఉంది. మాండరిన్ భాషలో కొన్ని వ్యాఖ్యలు సమాధిపై ఉన్నాయి. ఫుజియాన్ లో పింగ్నాన్ కు చెందిన 69316 యూనిట్ సైనికుడు షియాంగ్రాంగ్ సమాధి. 2020, జూన్ లో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణత్యాగం చేశాడు. అనే అర్థం వచ్చే రీతిలో వ్యాఖ్యలున్నాయి.

దక్షిణ షిన్ జియాంగ్ సైనిక ప్రాంతంలో ఆగస్టు 05వ తేదీన సమాధి శిలను ఏర్పాటు చేసినట్లు ఫొటో చెబుతోంది. కానీ నిజమైన చిత్రం కాదని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. చైనా అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.