Pig Kidney: మనిషికి పంది కిడ్నీ.. ఇంట్రస్టింగ్ సంగతులు!

అవయవాలకు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో సక్సెస్ అయిన ఆపరేషన్.. కొత్త వైద్య అధ్యాయానికి దారితీయొచ్చని డాక్టర్లు అంటున్నారు. 

Pig Kidney: మనిషికి పంది కిడ్నీ.. ఇంట్రస్టింగ్ సంగతులు!

Pig Kidney

Pig Kidney: అమెరికా వైద్యులు మరో ఘనత సాధించారు. ఇటీవల పంది గుండెను మనిషికి మార్పిడి చేసిన డాక్టర్లు.. ఈసారి పంది కిడ్నీలను బ్రెయిన్‌ డెడ్‌ రోగికి అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కూడా అయినట్టు ప్రకటించారు.

Read This : Pig Kidney to Human: పంది కిడ్నీని మనిషికి అమర్చిన సైంటిస్టులు

Read This : Saudi-Yemen : యెమన్ జైలుపై సౌదీ ఎయిర్ స్ట్రైక్.. వంద మందికి పైగా మృతి!

అలబామా విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్లు.. జన్యు మార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్ర పిండాలను సదరు వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన అతని శరీరం.. పంది మూత్ర పిండాలను తిరస్కరిస్తున్న సంకేతాలేవీ లేవని అలబామా విశ్వ విద్యాలయ డాక్టర్లు ప్రకటించారు. మూడు రోజులు కిడ్నీలు ఎంతో బాగా పని చేసినట్టు వివరించారు.

Read This : Amar Jawan Jyoti : అమర జవాన్ జ్యోతిని వార్ మెమోరియల్ జ్వాలలో ఎందుకు కలిపారు..? హిస్టరీ ఏంటి..?

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ను ఓ క్రమ పద్ధతిలో చేశామని డాక్టర్లు చెప్పారు. పందికి ఉన్న ఎలాంటి వైరస్‌ ఆయనకు సోకలేదని, రక్తంలో పంది కణాలు కూడా ఏవీ కనిపించలేదని డాక్టర్లు చెప్పారు. మనుషుల అవయవాలు అమర్చినట్టే ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ చర్య చేపట్టామని, సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో సక్సెస్ అయిన ఆపరేషన్.. కొత్త వైద్య అధ్యాయానికి దారితీయొచ్చని డాక్టర్లు అంటున్నారు.