Pilots asleep: ఆకాశంలో విమానం.. ఆదమరిచి నిద్రపోయిన పైలట్లు

ఆటోపైలట్ మోడ్‮‭కు సెట్టింగ్ టైం అయిపోవడంతో ఒక్కసారిగా గట్టిగా అలారం మోగింది. దీంతో నిద్రలోకి జారుకున్న పైలట్లు రెప్పపాటులో మేల్కొన్నారు. తమ పొరపాటును గ్రహించి విమానాన్ని సురక్షితంగా రన్‭వేపై ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానానికి కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి హానీ కలగలేదని ఇథియోపియన్ ఎయిర్‭లైన్స్‭ ప్రకటించింది. అయితే ఈ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇథియోపియన్ ఎయిర్‭లైన్స్‭ వెల్లడించలేదు.

Pilots asleep: ఆకాశంలో విమానం.. ఆదమరిచి నిద్రపోయిన పైలట్లు

Pilots asleep wile flight in the sky

Pilots asleep: ఏ వాహనం నడిపై వ్యక్తైనా సరే.. కాస్త ఆదమరిస్తే తర్వాతి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ప్రజా రవాణాలో ఉన్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ, వేల అడుగుల ఎత్తులో (37,000) విమానం ప్రయాణిస్తుండగా కాక్‭పిట్‭లో ఉన్న పైలట్లు ఆదమరిచి నిద్రలకి జారుకున్నారు. ఎంతలా అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ చేసినా గుర్తించలేనంత నిద్రమత్తులోకి జారుకున్నారు. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విమానం.. 25 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక ప్రయాణికుల ఆందోళన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆగస్టు 15న జరిగిన ఈ సంఘటన, ఇథియోపియన్ ఎయిర్‭లైన్స్‭కు చెందిన బోయింగ్ 737 విమానానికి సంబంధించింది. సూడాన్‭లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబా బయల్దేరిన విమానం మార్గమధ్యంలో పైలట్లు విమానాన్ని ఆటోపైలట్ మోడ్‮‭లో పెట్టి తాపీగా నిద్ర పోయారు. అప్పటికే విమానం గమ్యస్థానానికి చేరుకుంది. సదరు విమానం ఎయిర్‭పోర్టులో దిగాల్సిన సమయం అయినప్పటికీ ఎంతసేపటికీ విమానం నుంచి ఎలాంటి స్పందనా లేదని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు.. పైలట్లను సంప్రదించేందుకు రంగంలోకి దిగారు. అయినప్పటికీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆటోపైలట్ మోడ్‮‭లో ఉండడం వల్ల 25 నిమిషాల పాటు రన్‭వేవైపు చూడకుండా ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

ఇక ఆటోపైలట్ మోడ్‮‭కు సెట్టింగ్ టైం అయిపోవడంతో ఒక్కసారిగా గట్టిగా అలారం మోగింది. దీంతో నిద్రలోకి జారుకున్న పైలట్లు రెప్పపాటులో మేల్కొన్నారు. తమ పొరపాటును గ్రహించి విమానాన్ని సురక్షితంగా రన్‭వేపై ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానానికి కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి హానీ కలగలేదని ఇథియోపియన్ ఎయిర్‭లైన్స్‭ ప్రకటించింది. అయితే ఈ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇథియోపియన్ ఎయిర్‭లైన్స్‭ వెల్లడించలేదు. పైలట్లు నిద్రలో ఉండడంతో విమానం గాల్లో చక్కర్లు కొట్టిందంటూ పేర్కొన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Siddaramaiah: గాంధీనే చంపారు.. నన్ను విడిచి పెడతారా? బీజేపీపై సంచలన వ్యాఖ్యలు