కళ్లు ఎర్రబారాయా..అయితే..కరోనా కావొచ్చు !

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 01:13 AM IST
కళ్లు ఎర్రబారాయా..అయితే..కరోనా కావొచ్చు !

చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన వైరస్ ప్రపంచాన్ని వీడడం లేదు. భారతదేశంలో విస్తరిస్తూనే ఉంది. దీని విరుగుడుకు ఒక్కటే వ్యాక్సిన్ అని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. కానీ వైరస్ లక్షణాలపై ఏవో ఏవో వార్తలు వెలువడుతున్నాయి. ఏవీ నమ్మాలో అర్థం కావడం లేదంటున్నారు కొంతమంది.

ఎందుకంటే..దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే..అది కరోనా వైరస్ లక్షణమని తొలుత వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ…కళ్లు ఎర్రబారడం కూడా వైరస్ లక్షణమే అంటున్నారు కెనాడలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోస్ సోలర్టె వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధిచిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కంటి సమస్యతో తనకు వద్దకు ఓ మహిళ వచ్చిందని, ఫస్ట్ కంటి సమస్యగా తాను అనుకోవడం జరిగిందన్నారు సోలర్టె. తర్వాత..ఆమెకు కరోనా సోకిందని నిర్ధారించారని, కరోనా రోగుల్లో 10 నుంచి 15 శాతం మందికి సెకండరీ లక్షణంగా కండ్ల కలక, కళ్లు ఎర్రబారడం జరుగుతోందన్నారు. ఈ సమస్యలతో వచ్చే వారికి కరోనా పరీక్షను సిఫార్స్ చేయడం ఉత్తమమనే అభిప్రాయం వెలిబుచ్చారు. 

భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా రాకాసికి సంబంధించి..ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలు కనిపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. ఈ వైరస్ ఎప్పుడు వీడుతుందో అని అనుకుంటున్నారు జనాలు.

Read: భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తత : నిమిషంలో అ‍మ్ముడుపోయిన చైనా ఫోన్