Pizza on Volcano: అగ్నిపర్వతం లావా మీద తయారు చేసి పిజ్జా..టేస్ట్ సూపర్

సాధారణంగా ఓవెన్ లో పిజ్జాలు తయారు చేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా అగ్నిపర్వతం లావా మీద పిజ్జాను తయారు చేసి సూపర్ అనిపించుకున్నాడు. ఈ అగ్నిపర్వతం మీద కాల్చిన పిజ్జా టేస్ట్ కూడా సూపర్ గా ఉందని తెగ మెచ్చుకుంటున్నారు తిన్నవారు..

Pizza on Volcano: అగ్నిపర్వతం లావా మీద తయారు చేసి పిజ్జా..టేస్ట్ సూపర్

Pizza Preparation On Volcano (1)

Pizza Preparation on Volcano: ఈ పేరు చెబితే నోరూరిపోతుంది కదూ. పిజ్జాను సాధారణంగా ఓవెన్ లో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. కాస్త చాకచక్యం ఉన్నవారు గ్యాస్ స్టౌ మీద కూడా తయారుచేస్తారు. కానీ ఏకంగా పొగలు సెగలు కక్కే అగ్నిపర్వతం మీద పిజ్జా తయారు చేయటం గురించి బహుశా విని ఉండం. కనీసం ఊహించి కూడా ఉండం. కానీ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నవారే వార్తల్లోకెక్కుతారు. అలా ఏకంగా నిప్పులు కక్కే అగ్నిపర్వతం లావా మీద పిజ్జాను తయారు చేసిన ఘనత సాధించాడు డేవిడ్ గార్సియా అనే వ్యక్తి. పైగా ఈ పిజ్జా సూపర్ టేస్టుగా ఉంది కావాలంటే మీరూ తినండీ అంటూ నేరూరించేలా చెబుతున్నాడు.
ప్రపంచంలో రకరకాల కొత్త ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు పుడుతునే ఉంటాయి. అలా వచ్చిన ఐడియాతో 34 ఏళ్ల డేవిడ్ గార్సియా
గ్వాటేమేలాలోని పకాయ అగ్ని పర్వతం లావా వేడిమీద పిజ్జాలను కాల్చి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించాడు డేవిడ్ గార్సియా. ఏదో అగ్నిపర్వం వేడి వేడిగా పొగలు కక్కుతుంటుంది. అక్కడ పిజ్జా కాల్చటం పెద్ద విషయమేంటీ అని అనుకోవచ్చు. కానీ అది ఈజీ కాదు. రిస్క్ తో కూడుకున్నదే.

సాధారణంగా ఎవరూ అటువంటి ఆలోచన చేయడానికే సాహసించరు. నిత్యం ఎర్రటి చింతనిప్పులాగా రగిలిపోతూ పొగలు కక్కుతూ..ఎప్పుడు పగిలి బయటకు ఉరుకుదామా అని చూసే లావాను నింపుకున్న అగ్నిపర్వతం పైన ఆ లావా వేడిలో పిజ్జాలు కాల్చచటం అంత ఈజీ కాదు. ఎంత వ్యాపారం కోసం అయితే, మాత్రం అంత రిస్క్ అవసరమా మరీ విడ్డూరంకాకపోతే..అని అనుకోవచ్చు..కానీ కొత్తదనం కోరుకునేవారు రిస్కును ఎలా కాదనుకుంటారు చెప్పండి. అందుకే డేవిడ్ గార్సియా ఈ రిస్క్ చేశాడు.

గ్వాటేమేలాలోని పకాయ అగ్ని పర్వతం పై డేవిడ్ గార్సియా పిజ్జాలు చేశాడు. వీటికి ‘‘పకయా పిజ్జాలు‘‘ అని పేరుపెట్టాడు. దీనికోసం డేవిడ్ 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యెక లోహపు పలకలు ఉపయోగించాడు.అలాగే వేడి నుంచి రక్షణనిచ్చే దుస్తులను ధరించాడు. ఈ ఫోటోలను అతను సోషల్ మీడియాలో ఉంచారు. అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. అంతే కాదు గార్సియాను అక్కడ పిజ్జాలు చేస్తుంటే చూడటానికి, అగ్నిపర్వతం మీద తయారు చేసిన పిజ్జాతో పోజులివ్వడానికి అనేక మంది పర్యాటకులు అగ్నిపర్వత ప్రదేశానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా అగ్నిపర్వతం పై పిజ్జా తయారు చేసిన తరువాత కిందికి వచ్చిన గార్సియా మాట్లాడుతూ..”నేను ఈ పిజ్జను సుమారు 800 డిగ్రీల వేడి గుహలో పెట్టాను. అది 14 నిమిషాల్లో రెడీ అయిపోయింది” అని చెప్పాడు. అంతేకాదు దీనిని తిన్నవాళ్ళు ఈ పిజ్జా అగ్నిపర్వతం నుండి బయటకు రావడంతో చాలా అద్బుతమైన రుచితో ఉంది అని చెప్పారని తన ప్రయత్నాన్ని ప్రశంచారని తెలిపాడు.

కాగా ఈ పకాయ అగ్నిపర్వతం ఫిబ్రవరి నుండి విస్ఫోటనం చెందుతోంది. స్థానిక సంఘాలు, అధికారులను అప్రమత్తతో ఉన్నారు. ఈ అగ్నిపర్వత సముదాయం సుమారు 23,000 సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందింది. స్పానిష్ గ్వాటెమాల ఇప్పటివరకూ కనీసం 23 సార్లు విస్ఫోటనం చెందింది. అటువంటి ఈ పకాయ పర్వతం పొగలు సెగలపై పిజ్జాను కాల్చి స్పెషల్ ట్రెండ్ క్రియేట్ చేశాడు డేవిడ్ గార్సియా.