Pizza Customer: పిజ్జా లవర్.. ఆర్డర్‌లో కావాల్సింది పెద్ద పేజీనే రాసేశాడు

Pizza Customer: పిజ్జా లవర్.. ఆర్డర్‌లో కావాల్సింది పెద్ద పేజీనే రాసేశాడు

Pizza Loving Customers Mammoth 97 Word Order

Pizza Customer: ఫేవరేట్ ఫుడ్ ఆర్డర్ తినాలంటే దానికి కొద్దిగా కూడా అటూఇటు అవకుండా కరెక్ట్ గా ఉండాలని ఆశపడతాం. ఇక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటే అవన్నీ సాధ్యపడతాయా.. మన టేస్ట్ కు దగ్గరగా ఉన్న చోటుకు వెళ్లి తినేసి సర్దుకుంటాం. కానీ, ఓ కస్టమర్ తనకు పిజ్జాలో ఏం కావాలో.. పొడుగాటి వ్యాసమే రాసేశాడు.

పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడు ఎక్స్ ట్రా రిక్వెస్ట్ ఆప్షన్ ఉండటంతో చెలరేగిపోయాడు. అంత క్లియర్ గా చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పెప్పర్‌సినియో వ్యక్తి మళ్లీ వచ్చేశాడు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో తెలుసా..

‘నేను గ్రీన్ మిరియాలు కావాలన్నా. అవి అవసర్లేదు. దానికి బదులు బనానా మిరియాలు వాడండి. కామెంట్లలో టాప్ కు చేర్చి నాకు అన్‌కంఫర్టబుల్ పరిస్థితి తీసుకురావొద్దు’ అంటూ ఆర్డర్ పెట్టాడు. ఈ కామెంట్ సెక్షన్ అందిరికీ విజిబిలిటీలో ఉండటంతో దాని కింద 64వేల ఓట్లతో టాప్ అయింది.

పాపం అతనికి పెప్పర్స్ ఫ్రీగా ఇవ్వండి అని ఒకరు రాస్తే.. ఇంతకీ అతను అనుకున్నట్లే ఆర్డర్ వెళ్లింది కదా అని మరొకరు కామెంట్ చేశారు.