భారత్‌ను దెబ్బతీయడమే చైనా వ్యూహం. అందుకే లడఖ్‌లో సైన్యం మోహరింపు!

  • Published By: sreehari ,Published On : September 8, 2020 / 03:15 PM IST
భారత్‌ను దెబ్బతీయడమే చైనా వ్యూహం. అందుకే లడఖ్‌లో సైన్యం మోహరింపు!

LAC row: Chinese army fired shots: భారత్ చైనా సరిహద్దులో తూర్పు లడఖ్‌లో డ్రాగన్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. బీజింగ్ ప్లాన్‌తో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకు దూసుకొస్తోంది. 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (LIC) వెంట నిరంతరంగా ఒత్తిడి తెస్తూ భారతదేశాన్ని అస్థిరపరచడమే చైనా దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది..

ఇది కూడా బీజింగ్ వ్యూహంలో భాగంగానే పీఎల్ఏ లడఖ్‌లో బలగాలను మోహరిస్తోంది. అయినప్పటికీ చైనా కవ్వింపు చర్యలతో భారత్ సంయవనం పాటిస్తోంది.. 1960 లో రూపొందించిన గ్రీన్ లైన్ అనేది.. అప్పటి నేత మావో జెడాంగ్ లడఖ్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగా చెబుతారు.



దక్షిణ చైనా పిఎల్‌ఎకు ప్రధాన శత్రువు అయిన సూపర్ పవర్ అమెరికా.. తైవాన్‌కు మద్దతు ఇస్తోంది. ఇది డ్రాగన్ కు మింగుడు పడటం లేదు. కానీ, ASEAN సభ్యులు మాత్రం దీన్ని మరోలా భావిస్తున్నారు.. భారత్ పొరుగుదేశాలైన Tibet Xinjiang మాత్రం ఇటీవలి ఏళ్లలో బీజింగ్‌తో సుముఖంగానే ఉన్నాయి.
https://10tv.in/india-china-clash-at-pangong-lake/
Rezang La — Rechin La వద్ద సోమవారం జరిగిన ఘర్షణ తరువాత పిఎల్‌ఎ కమాండర్ Zhao Zongqi భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలకు ఎత్తులు వేస్తూనే ఉన్నారు.. వాస్తవానికి భారత బలగాలు చాకచక్యంగా చైనా ఆర్మీని అడ్డుకుంటున్నాయి. గ్రీన్ లైన్ దాటకుండా పీఎల్ఏను నిరోధించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి.



భారత ఆర్మీకి ధీటైన పాఠం నేర్పాలనే ఉద్దేశంతో పిఎల్‌ఎ లక్ష్యం. అందుకే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను ఉపయోగించాలని చూస్తోంది. ఆగస్టు 29-30 తేదీలలో జరిగిన యుద్ధంలో టిబెటన్ SFF జెసిఓ నైమా టెంజిన్ చేసిన త్యాగంతో ప్రపంచవ్యాప్తంగా టిబెటన్లలో చైనీయులపై వ్యతిరేకతకు దారితీసింది.

2013, ఆగస్టు 12న చైనా నిపుణులు అప్పటి జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్ శ్యామ్ శరణ్ అప్పటి ప్రధాన మంత్రి కార్యాలయానికి ఒక నివేదికను సమర్పించారు. భారత సైన్యం ఇండో-టిబెటన్ సరిహద్దులచే ఎల్ఐసి పెట్రోలింగ్ పెంచాలని సూచించింది.



భారతీయ ఎల్‌ఐసిలోని పెట్రోలింగ్ పాయింట్లను గ్రూప్ గుర్తించినప్పటికీ, పాయింట్ల మధ్య గణనీయమైన అంతరాలు ఉన్నాయని భారత సైన్యం గ్రహించింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌ఐసి వరకు పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెగేసి చెప్పింది.

భారత్ ను రెచ్చగొట్టడానికి తమ మిత్రదేశమైన పాకిస్థాన్‌ను చైనా పావులా వాడుకుంటోంది. నవంబర్‌లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత అమెరికా స్థానం మారితే లడఖ్‌లో భారత్ మరింత సైనిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు..