Plane Crash At Juba Airport : కుప్పకూలిన విమానం..ఐదుగురు మృతి

దక్షిణ సుడాన్​ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి మబాన్ కి బయలుదేరిన

Plane Crash At Juba Airport : కుప్పకూలిన విమానం..ఐదుగురు మృతి

Plane

Plane Crash At Juba Airport  దక్షిణ సుడాన్​ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి మబాన్ కి బయలుదేరిన విమానం టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే 10:36గంటల సమయంలో కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలెట్​తో పాటు ఐదుగురు మరణించారు.

మరణించినవారిలో ఇద్దరు రష్యాకు చెందిన వారు కాగా.. మిగతావాళ్లు దక్షిణ సుడాన్​కు చెందిన వారు. విమానం ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఇంధనం కూడా ఉన్నట్లు ఎయిర్​పోర్ట్​ వర్గాలు తెలిపాయి. కాగా, కూలిన విమానం ఆప్టిమమ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

అయితే తాజా ప్రమాదంతో 2011లో దక్షిణ సూడాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి విమాన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 87కి చేరుకుంది.

ALSO READ PM Modi Launches IRIS : ఆ ద్వీపాలకు అండగా “ఐరిస్” ఆవిష్కరించిన మోదీ..భారత నాయకత్వంపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు