Ravana Plane: శ్రీలంక ప్రజల విశ్వాసం నిజమేనా? రావణుడికి విమానం ఉందా? పరిశోధన ప్రారంభం!

లంకాధిపతి రావణుడు పౌరానిక పాత్రేనా? లేక నిజంగా ఉన్నారా? రాజుగా ఉన్నారా? రావణుని వద్ద విమానాలు ఉండేవా? వీటిపై పరిశోధన మళ్లీ మొదలైంది.

Ravana Plane: శ్రీలంక ప్రజల విశ్వాసం నిజమేనా? రావణుడికి విమానం ఉందా? పరిశోధన ప్రారంభం!

Ravana Plane

Ravana Plane: లంకాధిపతి రావణుడు పౌరానిక పాత్రేనా? లేక నిజంగా ఉన్నారా? రాజుగా ఉన్నారా? రావణుని వద్ద విమానాలు ఉండేవా? వీటిపై పరిశోధన మళ్లీ మొదలైంది. గతానికి సంబంధించిన అపోహలపై విస్తృత పరిశోధన చేయడానికి సిద్ధమవుతోంది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక వాసులు రావణుడే ప్రపంచంలోనే మొదటి పైలట్ అని నమ్ముతారు.

అతని కాలంలో శ్రీలంకలో విమానాలు తిరిగాయని, విమానాశ్రయాలు ఉండేవని చెబుతుంటారు దీన్ని అపోహగా అంగీకరించరు కూడా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది పరిశోధనలు కూడా చేశారు.

ఈ పరిశోధన కోసం గతంలోనే శ్రీలంక ప్రభుత్వం టీమ్‌ని ఏర్పాటు చేసినా.. కరోనా కారణంగా ఆగిపోయింది పరిశోధన. ఇప్పుడు మళ్లీ ఈ పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. ఈ కీలకమైన పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక భారతప్రభుత్వాన్ని కోరుతుంది.

రెండేళ్ల క్రితం కొలంబోలో జరిగిన పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తల సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా రావణుడు విమానాన్ని నడిపినట్లు సదస్సులో అందరూ అంగీకరించారు. ఈ విమానం శ్రీలంక నుంచి భారతదేశానికి వెళ్లిందని, ఆ తర్వాత రావణుడు విమానంలో శ్రీలంకకు మళ్లీ తిరిగి వచ్చాడని చెబుతున్నారు.

పరిశోధనలు ప్రారంభించేందుకు వీలుగా రూ.50 లక్షల గ్రాంట్‌ను కూడా విడుదల చేసింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ మాజీ ఛైర్మన్ శశి దానతుంగే మాట్లాడుతూ.. “కరోనా లాక్‌డౌన్ కారణంగా పరిశోధనలు నిలిపివేయవలసి వచ్చింది. ప్రస్తుత రాజపక్సే ప్రభుత్వం కూడా ఈ పరిశోధనకు అనుకూలంగా ఉంది. పరిశోధనలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పరిశోధన మళ్లీ ప్రారంభిస్తాం” అని అన్నారు

ప్రజల్లో అవగాహన:
చరిత్రపై ఆసక్తి ఉన్న శశి.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. దేశంలో పౌర విమానయాన చరిత్రను తెలుసుకోవడానికి చాలాకాలం పాటు ప్రయాణించాడు. ఆయన మాట్లాడుతూ- ‘రావణుడు పౌరాణిక పాత్ర కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. అతను నిజమైన రాజు. వాస్తవానికి వారికి విమానాలు మరియు విమానాశ్రయాలు ఉన్నాయి.

అయితే, అవి ఈనాటి విమానాల్లా ఉండేవి కావు.. ఖచ్చితంగా, పురాతన కాలంలో, శ్రీలంక, భారతీయ ప్రజలు అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నారు. దీని కోసం మనం విస్తృతమైన పరిశోధనలు చేయాలి. ఈ పరిశోధనలో భారతదేశం కూడా భాగం కావాలని శశి కోరారు. రెండు దేశాల ప్రాచీన వైభవం దృష్ట్యా ఈ పరిశోధన కీలకమని అభిప్రాయపడ్డారు.

ఈ పరిశోధనకు సపోర్ట్‌గా శ్రీలంకకు చెందిన గొప్ప పర్యావరణవేత్త సునేలా జయవర్ధనే ఉన్నారు. రావణుడి విమానం గురించి తన పుస్తకంలో చాలా విషయాలు రాశారు. ఇప్పుడు శ్రీలంకలో రావణుడి పుష్పక విమానం గురించి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. రావణుడి గౌరవార్థం శ్రీలంక కూడా ‘రావణ’ పేరుతో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.

Gay Judge: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. న్యాయమూర్తిగా ‘గే’!