ఒకే ఒక్క మొక్క ఖరీదు రూ.4లక్షలు..

  • Published By: nagamani ,Published On : September 4, 2020 / 11:22 AM IST
ఒకే ఒక్క మొక్క ఖరీదు  రూ.4లక్షలు..

ఒక మొక్క ఖరీదు అక్షరాలా రూ.4 లక్షలకు అమ్ముడైపోయింది..!!అస్సలు నమ్మకం కదూ..ఒక మొక్క మహా అయితే.. 40 రూపాయలు ఉంటుంది. లేదా 400 రూపాయలు ఉంటుంది. అదే బోన్సాయి లాంటి అరుదైన మరగుజ్జు మొకలైతే రూ. 1000 లేదా రూ.2000లు ఉండొచ్చు. కానీ ఒక మొక్క ఏకంగా రూ.4లక్షలేంటి?..మరీ విడ్డూరంకాకపోతే..అని తెగ ఆశ్చర్యపడుతున్నారా?…మరి ఆ మొక్క గురించి తెలుసుకుందాం..



న్యూజిలాండ్ లో ‘ఫిలోడెండ్రాన్ మినిమా’ జాతికి చెందిన ఒక మొక్కను ఇటీవల ట్రేడ్‌ మి అనే ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ వేలానికి పెట్టింది. అయితే ఈ మొక్కను సొంతం చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు తెగ పోటీపడ్డారు. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి ఆ మొక్కను కొనేశాడు. తరువాత అతడు ఆ మొక్క ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ మొక్క ‘ఉష్ణమండల స్వర్గం’ లా ఉంటుందని అతడు రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ తెలిపాడు. అందుకే ఆ మొక్కను అంత ఖరీదు పెట్టి మరీ కొనుక్కున్నానని తెలిపాడు.

ఆ అజ్ఞాత వ్య్తకి ఈ మొక్క గురించి మాట్లాడుతూ..’ఈ మొక్కలోని నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా లభించటంతో దీనికంత డిమాండ్ ఉంటుందని తెలిపాడు. తాము ఉష్ణమండల ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నామని, అందుకోసమే దీన్ని అంత ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇది ఒక పక్షి, సీతాకోక చిలుకకు ఆవాసంగా మారబోతున్నదని, అప్పుడు ఈ మొక్కను చూడడానికి మీ రెండు కళ్లూ చాలవని అతడు పేర్కొన్నాడు.