భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు 

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 08:37 AM IST
భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు 

మనీలా: ప్లాస్టిక్ మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల..వాయి కాలుష్యాలకు కారణంగా మారటంతో పాటు జంతువుల ప్రాణాలను నిలువునా హరించివేస్తోంది. ప్లాస్టిక్ కవర్లు తిని జంతువులు మృతి చెందాయనే వార్తలు మనం వింటున్నాం. కానీ అతిభారీ ఆకారాలతో భీతిగొలిపే తిమింగలాలు కూడా ఈ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న ఓ అతిపెద్ద భారీ తిమింగలం మృతి చెందింది. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో జరిగింది. 
Read Also :ఇంట్లో పెట్రో కెమికల్ బాంబు పేలుడు

తిమింగలం మృతి అనంతరం దాన్ని పోస్ట్ మార్టం చేయగా..దాని కడుపులో నుంచి 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడ్డాయి. వైద్య నిపుణులు అంచనా ప్రకారం దాని కడుపులో ప్లాస్టిక్ పేరుకుపోయిన కారణంగానే అది ఏమీ తినలేని పరిస్థితికి చేరింది. అందుకే అనారోగ్యంపాలై మృతి చెందని తెలిపారు.నదులు..సముద్రాలు ప్లాస్టిక్ వల్ల కాలుష్యకాసారాలుగా మారుతున్నాయనటానికి ఈ తిమింగలం మృతే ఉదాహరణ అంటున్నారు పర్యావరణ వేత్తలు. 

ఫిలిప్పీన్స్‌లోని కంప్టోస్టోలా వద్ద ఒక భారీ తిమిగలం మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించగా ..ఘటనాస్థలానికి వైద్య బృందంతో వచ్చిన అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో దాని కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ సంచులు..ఇంకా ఇతర వ్యర్థాలు వెలికి వచ్చాయి. కాగా గత పదేళ్లలో చనిపోయిన 61 డాల్ఫిన్లు, తిమింగలాలకు పోస్టుమార్టం నిర్వహించగా వాటి మృతికి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని వైద్య అధికారులు తెలిపారు. కానీ ఇంత  భారీ మెత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక తిమింగలం కడుపులో నుంచి వెలువడటం ఇదే తొలిసారంటున్నారు సదరు అధికారులు. కాగా..ఇప్పటికైనా కాలుష్యంపైనా..ప్లాస్టిక్ నిషేధంపైనా కఠిన చర్యలు తీసుకోవాలనీ..లేకుంటే మరిన్ని మూగజీవాలు బలైపోయే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. 
Read Also :కాంగ్రెస్ కు మరో షాక్ : కారెక్కుతున్న కొల్హాపూర్ ఎమ్మెల్యే