Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
చిన్నారుల ప్రాణాలు తీసినందుకు కన్నతల్లిగా నేను క్షమాపణలు చెబుతున్నాను. అంతమంది చిన్నారులను కాల్చి చంపడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా... ఆమె దానికి సరైన సమాధానమివ్వలేదు.

Texas School Shooter : ఎంతైనా తల్లి మనసు కదా.. కొడుకు హంతకుడైనా కన్నతల్లి ప్రేమ మాత్రం తగ్గదు. కొడుకు మీద ప్రేమ అలానే ఉంటుంది. 18ఏళ్ల టెక్సాస్ షూటర్ సాల్వడార్ రామోస్ స్కూలు చిన్నారులను అతిదారుణంగా కాల్చిచంపాడు. అదే స్పాట్లో అతన్ని పోలీసులు హతమార్చారు. తన కుమారుడిని హంతకుడు, సైకో అంటూ ఇలా అనేక రకాలుగా అంటుంటే ఆమె తల్లి మనస్సు తల్లడిల్లి పోయింది. తన కొడుకు చెడ్డవాడైనా కన్నకొడుకే కదా అని కన్నీరుమున్నీరైంది.
కొడుకు చేసిన పని తప్పుంటూనే.. అతన్ని మాత్రం నిందించవద్దని వేడుకుంటుంది. రామోస్ అలా చేయడానికి తనకు కారణాలున్నాయని తల్లి అడ్రినా మార్టినెజ్ తెలిపింది. ఓ టీవీ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమారుడు చేసింది తప్పే.. నన్ను, అతన్ని క్షమించండి.. దయచేసి ఎవరూ అతడి చేసిన పనిని జడ్జ్ చేయొద్దు.. చిన్నారుల ప్రాణాలు తీసినందుకు కన్నతల్లిగా నేను క్షమాపణలు చెబుతున్నాను. అంతమంది చిన్నారులను కాల్చి చంపడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా… ఆమె దానికి సరైన సమాధానమివ్వలేదు.

Please Dont Judge Him He Had His Reasons Says Mother Of Texas School Shooter
కొడుకు ఎంత తప్పు చేసినా వెనుకేసుకొచ్చే ఏకైక వ్యక్తి అమ్మే. ఇది మరోసారి రుజువైంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం యువాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లను 18 ఏళ్ల బాలుడు సాల్వడార్ రామోస్ తుపాకీతో మట్టుబెట్టడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో రామోస్ కూడా మరణించాడు. దీనిపై సాల్వడార్ రామోస్ కన్నతల్లి అడ్రినా మార్టినెజ్ స్పందించారు. ఓ టీవీ చానల్ తో ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను క్షమించండి. నా కుమారుడిని కూడా క్షమించండి. నా కొడుకు చేసిన పనికి అతడి వైపు నుంచి కారణాలు ఉన్నాయి. అది నాకు తెలుసు. దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దు. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారులు క్షమించాలనే నేను వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
అంతమందిని కాల్చి చంపడానికి కారణాలు ఏమున్నాయి? అని టీవీ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. హంతకుడు తండ్రి గ్రాండాడ్ స్పందిస్తూ.. నా కొడుకు చేసింది క్షమించారని నేరం.. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నా కుమారుడు ఇంత పనిచేస్తాడని కలలో కూడా ఊహించలేదు. పిల్లలను చంపడానికి బదులుగా నన్ను కాల్చి చంపాల్సింది. కాల్పుల్లో మరణించిన చిన్నారులను వారి తల్లిదండ్రులు ఎప్పటికీ చూడలేరు. అలాగే నా కొడుకును కూడా నేను ఎప్పటికీ చూడలేను.. నా కొడుకును కోల్పోయాననే బాధే ఎక్కువగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. స్కూల్లో కాల్పులు జరపడానికి ముందు రామోస్.. ఇంట్లో అతడి అమ్మమ్మను కూడా తుపాకీతో కాల్చిచంపాడు.
Read Also : Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి
1Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
2Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
3Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
4JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
5Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
6Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
7Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
8JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
9Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
10Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
-
Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?