పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 10:50 AM IST
పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగంలోకి వచ్చి పాక్ దాడులు చేయగలదని అన్నారు.
Also Read: పాక్ లో ఉన్నది అతనేనా : మన పైలెట్ మిస్సింగ్ నిజమే

పుల్వామా ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నామని నీతి వాఖ్యాలు పలికారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలు తమకివ్వాలని అన్నారు.ఉగ్రదాడిపై సరైన రీతిలో స్పందిస్తామని తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తలతో రెండు దేశాలకు ఎలాంటి లాభం లేదన్నారు. పరిస్థితులు చేయి దాటితే ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

సహనం కోల్పోతే పరిస్థితులు తన అదుపులో కానీ,భారత ప్రధాని మోడీ అదుపులో కానీ ఉండవన్నారు.యుద్ధాల వల్ల ఎలాంటి నష్టం జరగుతుందో మొదటి,రెండవ ప్రపంచ యుద్ధాల్లో చూశామన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటేనే మంచిదన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే భారత్ పాక్ పై దాడులకు పాల్పడుతోందని అన్నారు. అంతకుముందు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌‌ ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీతో(ఎన్‌సీఏ) సమావేశమయ్యారు. అలాగే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. దాడులు,ప్రతిదాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.  
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్

మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసి 300మందికిపైగా ఉగ్రవాదులను అంతమొందించిన విషయం తెలిసిందే. బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఎల్ వోసీ దాటి భారత భూభాగంలోకి వచ్చిన పాక్ యుద్ధవిమానాన్ని భారత్ కూల్చివేసింది. అదే సమయంలో కాశ్మీర్ లో ఓ భారత యుద్ధ విమానాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మరో భారత యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు పాక్ బుధవారం ఉదయం ప్రకటించింది. భారత్ కు చెందిన ఇద్దరు  పైలట్ లను తాము అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి పాక్ విడుదల చేసింది. ఆ వీడియోలో భారత పైలట్ అభినందన్ ను పాక్ చిత్రహింసలు పెడుతున్నట్లు ఉంది.
Also Read: 72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు