మోడీ ఎఫెక్ట్ : కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 11:08 AM IST
మోడీ ఎఫెక్ట్ : కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ

కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని ఇన్నాళ్లు ఓవరాక్షన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ దెబ్బకు ట్రంప్ దారికి వచ్చారు. ఫ్రాన్స్ లో జీ-7 సదస్సులో ప్రధాని మోడీ కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అనవసరమని తేల్చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ తర్వాత మాట్లాడిన మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో రెండు దేశాల(భారత్-పాక్) మధ్య విషయంగానే ఉందన్నారు. మోడీ వాదనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంగీకరించారు. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశం అన్నారు. కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. చర్చల  ద్వారా భారత్-పాక్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని ట్రంప్ సూచించారు. అంతేకాదు పాక్-భారత్ త్వరలో కలుస్తాయని ఆశిస్తున్నా అని ట్రంప్ అన్నారు.

ఈ మధ్యకాలంలో పదే పదే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఉత్సాహం చూపించిన ట్రంప్.. ప్రధాని మోడీ బోల్డ్ కామెంట్స్ తో షాక్ తిన్నట్లే కన్పించారు. అంతేకాదు కశ్మీర్‌ విషయంలో తాను, మోడీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు.. అక్కడ పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పారు. తాజా పరిణామంతో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌ ఇక బిక్కచచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..అమెరికా వెళ్లిన సమయంలో ట్రంప్ మీడియేషన్ కోరారు.. భారత్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిప్పికొట్టింది..ఇదే క్రమంలో ఇప్పుడు ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సులో భారత్ వైఖరి మరోసారి బలంగా చాటి చెప్పడంలో మోడీ సక్సెస్ అయ్యారు.

జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ఆర్థిక, వాణిజ్య రంగాలపై చర్చించామని ప్రధాని మోడీ తెలిపారు. ట్రంప్ నాకు మంచి మిత్రుడు అని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించామని వెల్లడించారు. ప్రపంచంలోనే భారత్ గొప్ప ప్రజాస్వామిక దేశం అని మోడీ అన్నారు. ప్రపంచ సంక్షేమానికి భారత్, అమెరికా కలిసి పని చేస్తాయన్నారు. మంగళవారం(ఆగస్టు 27,2019) విందుకు రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు ట్రంప్.

అమెరికాతో ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయని మోడీ చెప్పారు. శాంతి సహా అనేక అంశాలపై జీ-7 సదస్సుల్లో చర్చ జరిగిందన్నారు. కశ్మీర్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. భారత్-పాక్ లు ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి వచ్చిందన్న మోడీ.. ఉగ్రవాదం, పేదరికం లాంటి అంశాలపై భారత్-పాక్ యుద్ధం చేయాలన్నారు.

Also Read : నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు రద్దు