దేశానికి లాక్ డౌన్, చైనా గురించి మోడీ ఏం చెప్పబోతున్నారంటే…!

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 03:23 PM IST
దేశానికి లాక్ డౌన్, చైనా గురించి మోడీ ఏం చెప్పబోతున్నారంటే…!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్, చైనా గురించి మోడీ తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారా అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాల్వన్ లోయలో చైనా దళాలతో పోరాడిన సైన్యాన్ని ప్రశంసించిన మోడీ.. లడఖ్‌పై చైనాకు భారత్ తగిన స్పందన ఇచ్చిందని ఆదివారం ఆయన తన ‘ మన్ కి బాత్’ రేడియో కార్యక్రమంలో అన్నారు. వ్యాపారులు, పౌర సమాజం చైనా వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

లోకల్ వస్తువులనే కొనుగోలు చేస్తామని, లోకల్ గూడ్స్ మాత్రమే కొనేలా అందరూ గొంతెత్తి చాటి చెప్పాలని అన్నారు. మదర్ ఇండియా గౌరవాన్ని కించపరచే ఎవరినీ మన సైనికులు సహించరని స్పష్టం చేశారు. చైనా దళాలు ఇందులో 20 మంది భారతీయ సైనికులు విధి నిర్వహణలో అమరలయ్యారు. టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్‌తో సహా 59 చైనా యాజమాన్యంలోని మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత వారమే కరోనావైరస్‌పై పోరాడటానికి దేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. కరోనావైరస్ దెబ్బతిన్న నాలుగు యూరోపియన్ దేశాల జనాభా పరిమాణంతో సమానమైన ఉత్తర ప్రదేశ్, మరణాల సంఖ్యలో కొంత భాగాన్ని మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. కానీ, ఈ దేశాల జనాభా మొత్తం 24 కోట్లు అయితే.. ఒక్క యూపీలో మాత్రమే 24 కోట్లకు వస్తుందన్నారు. నాలుగు యూరోపియన్ దేశాలు కలిసి 1,30,000 కొవిడ్ మరణాలు నమోదు అయితే.. భారతదేశంలో యుపిలో మరణాల సంఖ్య 600 మాత్రమేనని అన్నారు. యుపి ఎంత ప్రభావవంతంగా ఉందో చూడవచ్చునని అన్నారు.

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,48,318 కు పెరిగింది. ఇందులో 16,475 మంది మరణించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నించినప్పటికీ కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. లాక్‌డౌన్ 2కు సంబంధించి కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిలో కంటైనర్ జోన్‌లలో లాక్ డౌన్ జూలై 31 వరకు పొడిగించింది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, జిమ్స్, స్విమ్మింగ్, బార్‌లు, అసెంబ్లీ హాల్‌లు లేదా మెట్రో సేవలు అన్ని మూతపడ్డాయి.

Read:కంటి చూపుకు హోం థెరఫీ.. రెడ్ లైట్‌తో బెటర్ రిజల్ట్