Rrussia Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగింపుకు మోదీ ఏం చేయబోతున్నారు? హీరోషిమా వేదికగా ఇచ్చిన శాంతిసందేశం యుక్రేనియన్ల ఆశలు నెరవేర్చేనా?

రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్‌స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబుబాధిత ప్రాంతం హీరోషిమా నుంచి ప్రధాని ఇచ్చిన శాంతిసందేశం...యుక్రేనియన్లను చీకటి నుంచి వెలుగువైపు నడిపిస్తుందా..?

Rrussia Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగింపుకు మోదీ ఏం చేయబోతున్నారు? హీరోషిమా వేదికగా ఇచ్చిన శాంతిసందేశం యుక్రేనియన్ల ఆశలు నెరవేర్చేనా?

PM Modi Rrussia ukraine War

PM Modi – Rrussia ukraine War : 15 నెలలుగా గ్యాప్ లేకుండా కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? యుద్ధాన్ని ముగించేందుకు భారత్ చేయబోయే ప్రయత్నాలేమిటి…? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది…? పుతిన్, జెలన్‌స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబుబాధిత ప్రాంతం హీరోషిమా నుంచి ప్రధాని ఇచ్చిన శాంతిసందేశం.. యుక్రేనియన్లను చీకటి నుంచి వెలుగువైపు నడిపిస్తుందా..?

యుద్ధం వల్ల కలిగే వినాశనం గురించి.. యుక్రెయిన్ లో ప్రతీ గల్లీ చెబుతుంది. ప్రతీ శిథిలం కథలుకథలుగా చెబుతాయి. రష్యా క్షిపణుల దాడులకు కునారిల్లిపోయిన ప్రతి గోడా… యుక్రేనియన్ల దీనగాథలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. ఈ యుద్ధం ముగుస్తుందా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మాతదేశాన్ని వీడి వెల్లిపోయినవారు తిరిగి వస్తారా? యుక్రెయిన్ లో మళ్లీ సన్ ఫ్లవర్ పూలు విరిబూస్తాయా? అనే సందేహాల మధ్య నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం యుక్రేనియన్ల జీవితంలో ఓ భాగమైంది. యుద్ధం ఈ క్షణం ముగిసినా యుక్రెయిన్ పునర్‌నిర్మాణానికి దశాబ్దాల కాలం పడుతుంది. అక్కడ జరిగిన..ఇంకా జరుగుతున్న పెను విధ్వంసం అంచనాలకు అందనిది. ఇంతటి భారీ నష్టం తర్వాత కూడా యుక్రెయిన్ అటు రష్యా,ఇటు యుక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల నుంచి అందుతున్న ఆయుధాల సాయంతో జెలన్‌స్కీ నేతృత్వంలో పోరాడుతూనే ఉంది. రష్యా ఆక్రమించిన భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనంచేసుకోవడమే తమ లక్ష్యమని జెలన్‌స్కీ చెబుతున్నారు. మరోవైపు రష్యా మాత్రం తన లక్ష్యమేంటో ప్రకటించలేదు కానీ..దాడులు ఆపడం లేదు. దీంతో యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోందే తప్ప తీవ్రత తగ్గడం లేదు.

PM Modi-Zelensky Meeet : మోదీయే మా నమ్మకం .. మోదీ, జెలన్‌స్కీ సమావేశంపై ప్రపంచం దృషి

యుద్ధం తర్వాత రష్యా ప్రపంచంలో ఒంటరయింది. ఆ దేశం నుంచి యూరప్ దేశాలు చమురుకొనడం మానేశాయి. దీంతో చవక ధరకు భారత్, చైనాకు రష్యా చమురు అమ్ముతోంది. మిగిలన దేశాలు ఏ ఆరోపణలు చేస్తున్నా..యుద్ధం చేయడానికి రష్యా కారణాలు రష్యాకున్నాయి. అంతమాత్రాన యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది అన్ని దేశాలూ చెప్పేమాట. చర్చలతోనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ కూడా అదే చెబుతోంది. యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్, చైనా తటస్థ వైఖరి అవలంబించాయి. భారత్… రష్యాకు అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఓటేయలేదు. భారత్, రష్యా మధ్య ఉన్న మిత్రత్వాన్ని దృష్టిలో పెట్టుకుని..యుద్ధానికి పరిష్కారం కనుగొనేదేశం భారతే అని మిగిలిన ప్రపంచమంతా భావిస్తోంది. జెలన్‌స్కీ కూడా గతంలో ప్రధాని మోదీతో మాటల్లో ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. మోదీ చెబితే..పుతిన్ వింటారన్నది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న విషయం.

యుద్ధం తర్వాత పుతిన్‌తో ప్రధాని సమావేశమయ్యారు. వీలయినంత త్వరగా యుద్దం పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఇప్పుడు జెలన్‌స్కీతో సమావేశంలో యుద్ధ పరిష్కారంలో భాగమవుతామని హామీ ఇవ్వడం ఇందులో భాగమే. సమయం, సందర్భం అన్నీ కుదిరినప్పుడు.. మోదీ శాంతిచర్చలకు మధ్యవర్తిత్వం వహించే అవకాశముంది. యుద్ధానికి దారితీసిన పరిష్కారం కాని సమస్యలపై రెండు దేశాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తే…మరుక్షణం యుద్ధం ఆగిపోతుంది. యుక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండడంతో పాటు.. యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా వ్యతిరేకశక్తులు ఉపయోగించుకునేందుకు అనుమతించనివ్వకూడదన్నది రష్యా చేస్తున్న ప్రధాన డిమాండ్. యుక్రెయిన్ ప్రభుత్వం..నాటోలో చేరబోమన్న హామీ ఇవ్వడం లేదు. రష్యా గతంలో ఆక్రమించుకున్న క్రిమియాతో పాటు… ఈ యుద్ధంలో ఆక్రమించుకున్న నాలుగు తూర్పు ప్రాంతాలు తిరిగి ఇచ్చేయాలన్నది జెలన్‌స్కీ డిమాండ్. అసలు యుక్రెయిన్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేదాకా యుద్ధాన్ని ఆపబోమని కూడా జెలన్‌స్కీ అంటున్నారు. ఎవరి వాదనల్లో న్యాయముంది..అన్యాయముంది అన్న సంగతిని పక్కనపెడితే..అసలు రెండు దేశాల నేతలు ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటే..ఓ పరిష్కారం దొరుకుతుంది. అలా కూర్చునే విధంగా చేయడానికే ప్రపంచదేశాలు చొరవచూపాలి. ఇప్పుడు మోదీ అదే చేయాలన్నది అన్ని దేశాల ఆలోచన. రష్యా మిత్రదేశంగా..భారత్ చర్చలకు మార్గాన్ని సుగమం చేయాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి.

Japan: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి భేటీ.. ఎందుకంటే?

రష్యా, యుక్రెయిన్ మధ్య చర్చలు జరిగేలా చూడడానికి మిగిలిన దేశాల నేతలతో కలిసి ప్రధాని మోదీ ప్రయత్నించే అవకాశముంది. యుద్ధంతో సర్వనాశనమైన హీరోషిమా వేదికగా ప్రధాని వినిపించిన శాంతిసందేశం అమలు జరగాలని ఆ ప్రతిఫలాన్ని యుక్రెయిన్ ఊపిరి పీల్చుకోవాలని భావిస్తోంది. హీరోషిమాలో మోదీ జెలన్‌స్కీ సమావేశం,శాంతియుత పరిష్కారంతో యుద్ధం ముగిసే అవకాశముందన్న అభిప్రాయం కలిగిస్తోంది. మోదీతో సమావేశం తర్వాత చర్చలపై జెలన్‌స్కీకి ఓ నమ్మకం కలిగింది. అందుకే మానవతాదృక్పథంతో సాయం చేయడానికి సిద్ధమైన భారత్‌కు జెలన్‌స్కీ కృతజ్ఞత తెలిపారు. అందరి ఆకాంక్షలూ ఫలించి భారత మధ్యవర్తిత్వంతో యుద్ధం ముగిస్తే…ఆ రెండు దేశాలే కాక మిగిలిన ప్రపంచమంతా కూడా సంతోషిస్తుంది.

కాగా..ఇక ఈ యుద్ధానికి ముగింపు కలుగే ఆశలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధాని మోదీ ఈ ఏడాది చివర్లో భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు ముందే ప్రధాని మోదీ రష్యా,యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు మాస్కో వెళ్లే అవకాశమున్నట్లుగా సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ భేటీ అయి ఈ విషయం గురించి చర్చిస్తారని సమాచారం. ఈ చర్చలు ఫలిస్తే పుతిన్ అంగీకరిస్తే ఇక ఈ యుద్ధానికి ముగింపు వచ్చినట్లే..అదే జరగాలని ప్రపంచమంతా భావిస్తోంది. మోదీ యత్నంతో ఈ యుద్ధం ముగింపు జరిగితే ఇక భారత్ ఘనత ముఖ్యంగా మోదీ ఘనతను ప్రపంచమంతా కీర్తిస్తుంది. ఒక యుద్ధం మొదలైతే ఎంత నష్టమో.. ఆయుద్ధానికి ముగింపు వస్తే అంతే ఆనందం..ఆ ఆనందం యుక్రెయిన్ కు తద్వారా ఈ ప్రపంచానికి కలుగుతుందని దానికి మోదీ యత్నం ఫలించాలని ఆశిద్దాం.