6 రోజుల్లో 9లక్షలకు పైగా కోళ్లను కోసి పడేసారు..చంపేది తినటానికి కాదు..

  • Published By: nagamani ,Published On : November 28, 2020 / 11:35 AM IST
6 రోజుల్లో 9లక్షలకు పైగా కోళ్లను కోసి పడేసారు..చంపేది తినటానికి కాదు..

Poland to cull more than 9 lakh hens : డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తిస్తోంది ప్రభుత్వం లక్షలాది మింక్ లకు చంపి పూడ్చిపెట్టేసింది. అలాగే పోలాండ్‌ లక్షలాది కోళ్లను కోసిపడేస్తున్నారు. కారణం ఏంటంటే..కొత్త డర్బ్ ఫ్లూ విజృంభిస్తోందని. దీంతో కేవలం ఆరంటే ఆరురోజుల్లో ఏకంగా 9 లక్షల కోళ్లను కోసి పడేశారు అధికారులు.



వివరాల్లోకి వెళితే..పోలాండ్‌లోని రోనియావీ ప్రాంతంలో H5N8 బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ ప్రాంతంలోని కోళ్లకు చావొచ్చిపండింది. కోళ్ల ఫాంలలో ఉన్న 9,30,000 కోళ్లను సమాధి చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో అధికారులు కోళ్లను ఫసక్ చేసేయటానికి పూనుకున్నారు.



ఈ విషయాన్ని పోలండ్‌లో స్థానిక వార్తా సంస్థ పీఏపీ తెలిపింది. నవంబర్ 23 సాయంత్రం నుంచి ఈ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అలా ఇప్పటి వరకూ ఫాంలలో ఉన్న 9లక్షలకు పైగా కోళ్లను సమాధి చేసేశారు.



రోనియావీ ప్రాంతం ఉన్న కోళ్ల ఫారాల్లో 9,30,000 కోళ్లు ఉన్నాయి. ఆ కోళ్ల ఫాం వెనుక కాలువ ఉంది. పంట పొలాలు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని అడవి పక్షులు కూడా ఉన్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కోళ్లను చంపేయాలని నిర్ణయించామని ఆరు రోజుల పాటు ఈ వధ కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు.



ఇప్పటికే వరుసగా ఫ్లూలు విజృంభిస్తుంచటడంతో కోళ్ల వధ జరుగుతోంది. దీని వల్ల మనుషులకు అంత భారీ ప్రమాదం లేదని తెలిసినా..ఎందుకైనా మంచిదని అధికారులు ముందస్తు జాగ్రత్తగా కోళ్లను సమాధి చేయాలని నిర్ణయించారు. ఈ విషయంపై స్పందించేందుకు పోలండ్ చీఫ్ వెటర్నరీ ఇన్‌స్పెక్టర్ అందుబాటులోకి రాలేదని పీఏపీ సంస్థ పేర్కొంది.